బిజెపి,బీజేవైఎం బైక్ ర్యాలీని విజయవంతం చేయాలి
బీబీనగర్,మేజర్, న్యూస్:
భారత ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగ నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా చేపడుతున్న సేవా జ్యోతి కలశ్ యాత్రను పురస్కరించుకుని
ఈనెల 7వ తేదీన నిర్వహించనున్న బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని జిల్లా బీజేవైఎం కోశాధికారి పరమేష్ నాయక్ పిలుపునిచ్చారు.
మంగళవారం బీజేపీ మండల అధ్యక్షులు భువనగిరి సదానందం గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ
అక్టోబర్ 7 బుధవారం రోజు ఉదయం 9గంటలకు
భువనగిరి జిల్లా కేంద్రంలోని సాయిబాబా టెంపుల్ నుంచి ప్రిన్స్ కార్నర్ చౌరస్తా వరకు
బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ సేవా,సుపరిపాలన, ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
బీబీనగర్ మండలం నుంచి బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు,యువత అధిక సంఖ్యలో బైక్ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పరమేష్ నాయక్ కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ బోయిపల్లి గోపాల్ రెడ్డి జిల్లా మహిళా మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ రాంపల్లి రేణుక,మండల ప్రధాన కార్యదర్శి కాసులశ్రీకాంత్ గౌడ్, యువమోర్చా నాయకులు భూత్ అధ్యక్షులు ఎరుసాని శ్రీకాంత్ నిమ్మల శివ, బిజెపి బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు