BREAKING
స్వచ్ఛ పార్వతీపురం – మన్యం మర్యాద సిద్ధిపురంలో అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం కొడవలూరు మండలానికి పల్లె పండుగ 3.0లో రూ.2.06 కోట్ల పనులు శ్రీశైలంలో నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అద్దంకిలో ఈనెల 9న ప్రజాస్వామ్య ఎన్నికల ర్యాలీ. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట 2450 మంది కి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.ఎన్ విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ పోటీలు ఇంటి ముంగిట అక్షరం... ఉమ జీవితంలో వెలుగుల విప్లవం! భూ సేకరణ పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించాలి జలాంతర్గాముల తయారీకి అండూరిల్‌తో భారీ ఒప్పందం కడప అమీన్‌పీర్ దర్గా ఉర్సుకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్‌డేట్.. కోలుకుంటున్న వైనంపై ఎమోషనల్ వీడియో వైరల్ ఎస్సీ భూముల జోలికొస్తే చర్యలు తప్పవు ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపండి - డిప్యూటీ కమిషనర్ చెన్నుడు

రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడోత్సవాల్లో ప్రతిభ కనబరిచిన గిరిజన గురుకులం విద్యార్థులు...

Select Suryaa Now
రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడోత్సవాల్లో ప్రతిభ కనబరిచిన గిరిజన గురుకులం విద్యార్థులు...

రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడోత్సవాల్లో ప్రతిభ కనబరిచిన గిరిజన గురుకులం విద్యార్థులు...

- విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపాల్ ఎన్ చైతన్య..

వేములవాడలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి బాలబాలికల కబడ్డీ క్రీడోత్సవంలో భద్రాద్రి కొత్తగూడెం టీం సబ్ జూనియర్ విభాగంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆ టీంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల అప్గ్రేడ్ జూనియర్ కళాశాల విద్యార్థినిలు ఇంటర్ ఫస్టియర్ కె అలేఖ్య, హెచ్ఇసి , జెర్సీ నెంబర్ 10, పి దీవెన, సిఇసి జెర్సీ నెంబర్ 11 ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపల్ ఎన్ చైతన్య సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు చదువులోనే కాక క్రీడల్లోనూ రాణించడం గర్వకారణం, వారి క్రమశిక్షణ పట్టుదల వల్లె ఈ విజయం సాధ్యమైంది, భవిష్యత్తులో జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

సూర్య ప్రతినిధి, అన్నపురెడ్డిపల్లి,చందు..