telanagana
దసరా నాటికి డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనులు పూర్తి చేయాలి
సూర్య-గోదావరిఖని:దసరా పండుగ నాటికి డబుల్ బెడ్‌రూం ఇళ్లలో లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు జరిగేలా మౌలిక వసతుల పనులను వేగవంతం చేసి, అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఇక్కడి 2వ డివిజన్ జంఘాలపల్లిలోని డబుల్ బెడ్‌రూం ఇళ్లను మేయర్ సందర్శించి, అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రహదారుల నిర్మాణం, విద్యుత్ సరఫరా, తాగునీటి పైప్‌లైన్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా వేగం పెంచాలని, నాణ్యతలో రాజీ పడకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం రామగుండం 25వ డివిజన్‌లో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను మేయర్ పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వెంగళ బాపు, దాసరి సాంబమూర్తి, బాలసాని తిరుపతి, డేవిడ్‌రాజు, ఆర్‌అండ్‌బీ డీఈఈ రషీద్, ఏఈ జావీద్, 25వ డివిజన్ కార్పొరేటర్ సిరిశెట్టి సతీష్, డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.