జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 48,463 మంది ఓటర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్,జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 48,463 మంది ఓటర్లు ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ కే వెంకటరమణ మంగళవారం తెలిపారు. వీరిలో 23,409 మంది పురుషులు, 25,025 మంది మహిళలు, 29 మంది ఇతరులు ఉన్నారని పేర్కొన్నారు.సామాజిక వర్గాల వారీగా ఎస్టీ ఓటర్లు 1,190 మంది, ఎస్సీ 5,930 మంది, బీసీ 22,133 మంది, జనరల్ కేటగిరీకి 19,210 మంది ఉన్నట్లు తెలిపారు.మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు, 64 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. పోలింగ్ కేంద్రాలను సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, నార్మల్ కేటగిరీలుగా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. స్థానిక ఎస్సై, టౌన్ ప్లానింగ్ అధికారి, సిబ్బంది సహకారంతో పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.మున్సిపాలిటీ జనాభా సుమారు 59 వేల మంది ఉండగా, ఓటు హక్కు కలిగిన వారు 48,463 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు.
రిపోర్టర్:- కె.వి రమణారావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా,