BREAKING
కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి. బిజెపి జిల్లా అధ్యక్షులు. ప్రపంచ స్థాయిలో ఎస్వీయూ అధ్యాపకుల అరుదైన ఘనత రష్యాలోని ప్రముఖ ప్లేగ్ పరిశోధనా కేంద్రంలో విషాదం ఐరాసలో గళమెత్తిన అరకు ఎంపీ.. భారత్ తరఫున కీలక ప్రసంగం -ఐక్యరాజ్యసమితి వేదికపై భారత్ తరఫున ప్రసంగించిన అరకు ఎంపీ తనుజారాణి దసరా మహోత్సవాలకు జిల్లా కలెక్టర్కు ఆహ్వానం జర్మనీలో సంచలన విజయం సాధించినా ప్రభుత్వ ఏర్పాటులో అడుగు ముందుకు పడని ఏఎఫ్‌డీ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మేఘాంశ్ శ్రీహరి సినిమా! స్త్రీ ఆత్మబలం దేశ భవిష్యత్తుకు పునాదని నమ్మిన వ్యక్తి చంద్రబాబు. గొట్టిపాటి లక్ష్మి. శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో ఘనంగా వరుణ యాగం చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో జోకోవిచ్ జైత్రయాత్ర ఐరాసలో గళమెత్తిన అరకు ఎంపీ. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 48,463 మంది ఓటర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ గరివిడి లక్ష్మి ట్రైలర్ అద్భుతంగా ఉంది.. ఇది థియేటర్లలో సెలబ్రేట్ చేసుకునే సినిమా: అడివి శేష్ స్మశానం దారి అడ్డుకుంటున్నా,ప్రభుత్వ భూమి ఆక్రమిస్తున్నా పట్టించుకోని అధికారులు 9/11 నుంచి విమానయాన భద్రతను పూర్తిగా మార్చేసిన కీలక ఘటనలు

నర్సింగోలులో సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

Select Suryaa Now
నర్సింగోలులో సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

హెలిప్యాడ్‌, ప్రజా వేదిక, పార్టీ క్యాడర్‌ సమావేశ స్థలాల పరిశీలన

అధికారులు, నాయకులకు మంత్రి డోలా, కలెక్టర్‌ రాజాబాబు సూచనలు

పర్యటనను విజయవంతం చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు

సూర్య ప్రతినిధి, ఒంగోలు :

ఈ నెల 9న ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు కొండపి నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో జరుగుమల్లి మండలం నర్సింగోలులో చేపట్టనున్న హెలిప్యాడ్‌, ప్రజా వేదిక, పార్టీ క్యాడర్‌ సమావేశ స్థలాలను రాష్ట్ర మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, జిల్లా కలెక్టర్‌ పి. రాజాబాబు, రాష్ట్ర మారిటైమ్‌ బోర్డు చైర్మన్‌, జోనల్‌ కో-ఆర్డినేటర్‌ దామచర్ల సత్య పరిశీలించారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అనంతరం అధికారులకు, నాయకులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు.