సీనియర్ సిటిజన్స్ సమాజ సంక్షేమం కోసం కృషి చేయాలి రాష్ట్ర అధ్యక్షులు కుకునూరి రామచంద్రరావు
జంగారెడ్డిగూడెం, మేజర్ న్యూస్ :- సీనియర్ సిటిజన్స్ కుటుంబ సంక్షేమంతో పాటు సమాజ సంక్షేమం కోసం కూడా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాతీయ ఉపాధ్యక్షులైన కుకునూరి రామచంద్రరావు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ముగింపు సమావేశం అసోసియేషన్ భవనంలో అధ్యక్షులు కుప్పాల కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఆత్మీయ అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కుకునూరు రామచంద్రరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా ఉపాధ్యక్షులు సమయ మంత్రి రాధాకృష్ణమూర్తి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వయోవృద్ధులైన తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తి, సీనియర్ జర్నలిస్టు కేశురాజు వెంకటరమణ రావు, పాకిరం వీరమ్మ, పందిరి రమణమ్మలను సీనియర్ సిటిజన్ దల్లి కేదారేశ్వర రెడ్డి (డీకే రెడ్డి) నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. 50 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. సమావేశం కార్యదర్శి పివి రెడ్డి,కూచి త్రినాధ రావు, బోడా సత్యనారాయణ, కంచర్ల గాంధీ, కర్పూరం బాలకృష్ణ, కె.వి.రామారావు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు చామర్తి శ్రీరాములు, గుమ్మడి సుందర రామయ్య,కోరా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: కె.వి రమణారావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా