BREAKING
ఎన్ఎస్‌యూఐ నాయకులపై దాడి పిరికిపంద చర్య మరిపెడలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్సై పై చర్యలు తీసుకోవాలి అంగన్వాడీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి పశుగ్రాసం సాగుకు ఉపాధి హామీ పథకంలో ప్రోత్సాహం 35 కిలోల గంజాయి స్వాధీనం -ఇద్దరుఅరెస్టు ఆరవ డివిజన్‌లో నారాయణ నేత్ర జ్యోతి మహా యజ్ఞం - కొండ ప్రవీణ్ శంకర్ ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి డిఆర్ డి ఓ సి హెచ్. శ్రీనివాస్ రావు సామాజిక అణిచివేత, ఆర్థిక దోపిడీలపై ఐక్యంగా పోరాడుదాం ప్రభుత్వాధినేతగా 25ఏళ్ళ ప్రజాసేవ పూర్తిచేసుకున్న ప్రధాని మోడీకి మంత్రి ఆనం అభినందనలు విటమిన్ డి లోపం ఉంటే శరీరంలో ఎలాంటి ప్రమాదకర సమస్యలు వస్తాయో తెలుసా? అంగన్వాడీ టీచర్ నియామకాలకు…మరో అవకాశం పెచ్చులుడుతున్న పాత పాఠశాల భవనం భయాందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు పీఎం అజయ్ కు ముత్తారం ఎంపిక అనారోగ్య బాధితుడికి ఎంఎల్‌ఏ ఎల్‌ఓసి అందచేత

వడ్డే ఓబన్న జీవితాన్ని పాఠ్యాంశంగా ముద్రించాలి

Select Suryaa Now
వడ్డే ఓబన్న జీవితాన్ని పాఠ్యాంశంగా ముద్రించాలి

180 వ వర్ధంతి సభలో వివిఎస్ నేతల ఘన నివాళి

నెల్లూరు/వేదాయపాలెం , మేజర్ న్యూస్   :  తొలి స్వాతంత్ర్య సమరయోధుడు, రేనాటి వీరుడు వడ్డే ఓబన్న జీవితాన్ని నేటి, భావి తరాలకు తెలిపేందుకు ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా పుస్తకాలలో ముద్రించాలని వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు కోరారు. వడ్డే ఓబన్న 180వ వర్ధంతి సందర్భంగా వడ్డెర వృత్తిదారుల సంఘం నాయకులు కార్యకర్తలు నెల్లూరులోని పూలే బొమ్మ వద్ద ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో మంగళవారం సాయంత్రం వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోటకొండ వెంకటేష్, జిల్లా కార్యదర్శి బెల్లంకొండ బాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులకు ఎదురోొడ్డి నిలిచి స్వాతంత్రం  కోసం పోరాడిన తొలి స్వాతంత్ర్య పోరాట వీరుడు వడ్డే ఓబన్నని తెలిపారు. 1807 అక్టోబర్ ఆరవ తేదీన రేనాటి ప్రాంతాన సంజమల మండలం నొసం గ్రామం లో సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు  వడ్డే ఓబన్న జన్మించారన్నారు. చిన్నతనం నుంచి దేశభక్తితో పెరిగాడన్నారు. నాటి రేనాటి ప్రాంత పాలిగాడు సైరా నరసింహారెడ్డికి అనుచరుడు గాను, స్నేహితుడుగాను ఆప్తుడుగాను కొనసాగారన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పాలిగాళ్ల వ్యవస్థను రద్దుచేసి పాలిగాళ్లకు, భరణం నామమాత్రంగా ఇవ్వడం, రైతులపై అధిక పన్నులు వేయడాన్ని వ్యతిరేకిస్తూ సైరా నరసింహారెడ్డి తలపెట్టిన పోరాటానికి వడ్డె ఓబన్న అండగా నిలిచారన్నారు. నరసింహారెడ్డి సైన్యానికి సైనిక అధ్యక్షుడుగా నిలిచి తన ధైర్య సాహసాలతో బ్రిటిష్ సైనికుల ఆధునిక యంత్రాలను ఎదుర్కొన్నారు. కోవెలకుంట్ల అడవుల్లో అంగుళం అంగుళం, వాగులు, వంకలు తెలిసిన ఓబన్న తన సైన్యమైన బోయలు, చెంచులు, వడ్డెరలు తదితర వారితో కలిసి  గెరిల్లా యుద్ధం కొనసాగించారన్నారు.
ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంతో విరోచితంగా కోవెలకుంటలో పోరాడుతూ చివరకు ఆయన 184 6 అక్టోబర్ ఆరో తేదీన నేలకొరిగి వీరమరణం పొందారన్నారు. ఆయన ఆశయాలను నేటి పాలకులు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన కేవలం ఒక వడ్డెర జాతికి సంబంధించిన వీరుడు కాదని, అన్ని వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా ముద్రించడమే కాకుండా ఆయన జయంతిని ప్రభుత్వం నిర్వహించినట్టుగానే వర్ధంతిని కూడా నిర్వహించాలని, ఆయన విగ్రహాన్ని ప్రతి జిల్లా కేంద్రంలో ప్రధాన కూడలిలో ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేయాలని, బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ లలో రిజర్వేషన్ కల్పించాలని అప్పుడే ఆయన ఆశయాలు కొనసాగించినట్టని తెలిపారు. కార్యక్రమంలో వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా కోశాధికారి మళ్లీ నాగర్జున, జిల్లా కమిటీ కమిటీ సభ్యులు బత్తల ప్రసాద్, బత్తల నాగరాజు, మళ్లీ మధు, తదితరులు పాల్గొన్నారు.