నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఘనంగా వరుణ యాగం
ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో దేవదాయ ధర్మదాయ శాఖ ఆదేశాల మేరకు, మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో
జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండి రైతులు, ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నీటి వనరులు నిండాలని, పంటలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడి పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ వరుణ దేవుడిని ప్రార్థిస్తూ ఈ వరుణ యాగాన్ని నిర్వహించారు. వర్షాధారంగా జీవించే రైతులకు సాగునీరు సమృద్ధిగా లభించి, రైతులు, ప్రజలు సుఖశాంతులతో, సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతో వేదోక్త పద్ధతిలో ఈ యాగాన్ని నిర్వహించారు.వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షా సంకల్పం, అగ్ని ప్రతిష్ఠ, వరుణజపం, వరుణ యాగం, సహస్రఘటాభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌరిమాన్ పటేల్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్య బాబు, మల్లా సురేంద్ర, కోట్ని బాలాజీ, దేవదాయ శాఖ అధికారులు, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఈఓ యాళ్ల శ్రీధర్, జోనల్ కమిషనర్ చక్రవర్తి, ఆలయ ధర్మకర్తలు
అధికారులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.
అనేకాపల్లిప్రతినిధి