BREAKING
కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి. బిజెపి జిల్లా అధ్యక్షులు. ప్రపంచ స్థాయిలో ఎస్వీయూ అధ్యాపకుల అరుదైన ఘనత రష్యాలోని ప్రముఖ ప్లేగ్ పరిశోధనా కేంద్రంలో విషాదం ఐరాసలో గళమెత్తిన అరకు ఎంపీ.. భారత్ తరఫున కీలక ప్రసంగం -ఐక్యరాజ్యసమితి వేదికపై భారత్ తరఫున ప్రసంగించిన అరకు ఎంపీ తనుజారాణి దసరా మహోత్సవాలకు జిల్లా కలెక్టర్కు ఆహ్వానం జర్మనీలో సంచలన విజయం సాధించినా ప్రభుత్వ ఏర్పాటులో అడుగు ముందుకు పడని ఏఎఫ్‌డీ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మేఘాంశ్ శ్రీహరి సినిమా! స్త్రీ ఆత్మబలం దేశ భవిష్యత్తుకు పునాదని నమ్మిన వ్యక్తి చంద్రబాబు. గొట్టిపాటి లక్ష్మి. శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో ఘనంగా వరుణ యాగం చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో జోకోవిచ్ జైత్రయాత్ర ఐరాసలో గళమెత్తిన అరకు ఎంపీ. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 48,463 మంది ఓటర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ గరివిడి లక్ష్మి ట్రైలర్ అద్భుతంగా ఉంది.. ఇది థియేటర్లలో సెలబ్రేట్ చేసుకునే సినిమా: అడివి శేష్ స్మశానం దారి అడ్డుకుంటున్నా,ప్రభుత్వ భూమి ఆక్రమిస్తున్నా పట్టించుకోని అధికారులు 9/11 నుంచి విమానయాన భద్రతను పూర్తిగా మార్చేసిన కీలక ఘటనలు

*కార్మిక సంక్షేమమే టీజేఎంయు లక్ష్యం*

Select Suryaa Now
*కార్మిక సంక్షేమమే టీజేఎంయు లక్ష్యం*

*-ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి*

*-టీజేఎంయు  యాదగిరిగుట్ట సెక్రెటరీ డొంకెన వెంకటేష్ గౌడ్*

 యాదాద్రి: టీజీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు కార్మికులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించడమే టీజేఎంయూ లక్ష్యమని తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ యాదగిరిగుట్ట డిపో సెక్రెటరీ డొంకెన వెంకటేష్‌గౌడ్‌ అన్నారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారంతో కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.2025 వేతన సవరణను వెంటనే అమలు చేయడంతో పాటు 2017, 2021 వేతన సవరణ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అకారణ సస్పెన్షన్లు, ఛార్జ్‌షీట్లు, వేధింపులకు అడ్డుకట్ట వేయాలని, అధిక డ్యూటీలు, పని భారాన్ని తగ్గించి శాస్త్రీయ డ్యూటీ విధానం అమలు చేయాలని కోరారు. డ్రైవర్లు, కండక్టర్లకు డ్యూటీ గంటలు, రన్నింగ్‌ టైమ్‌, విశ్రాంతి సమయాలను శాస్త్రీయంగా నిర్ణయించాలన్నారు.డిపోల్లో సిబ్బంది కొరతను తీర్చి ఖాళీలను భర్తీ చేయడం, గ్యారేజ్‌ సిబ్బందిపై పని భారం తగ్గించడం, పవర్‌ టూల్స్‌ అందించడం, తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిని కొనసాగించడం వంటి అంశాలను ప్రాధాన్యంగా పేర్కొన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబాలకు క్యాష్‌లెస్‌ వైద్య సదుపాయం, పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, మహిళా ఉద్యోగులకు సురక్షిత పని వాతావరణం కల్పించాలని కోరారు. రిటైర్డ్‌ కార్మికుల పెన్షన్‌, వైద్య, రిటైర్మెంట్‌ ప్రయోజనాల సమస్యలను పరిష్కరించాలని, కారుణ్య నియామకాల్లో అపాయింట్‌మెంట్‌ తేదీ నుంచే రెగ్యులర్‌గా పరిగణించాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల హక్కులు, గౌరవం, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతామని వెంకటేష్‌గౌడ్‌ స్పష్టం చేశారు.