ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలి -- ఎమ్మెల్యే బడేటి చంటి కి వినతి
ఏలూరు, మేజర్ న్యూస్ : ఆశ వర్కర్ల సమస్యలకు కనీస వేతనాలు ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణకు వినతి పత్రం అందజేశారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఎం.లోకేశ్వరి, నవ్యరాణి, దేవి సమస్యలను శాసనసభ్యులకు వివరించారు. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి వెళ్తానని, సమస్యలు పరిషించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. స్థానికంగా ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే నా దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ ఆశ వర్కర్లు పెరిగిన ధరలతో వేతనాలు సరిపోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.నిత్యవసర వస్తువులు ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయని కానీ ఏడు సంవత్సరాలుగా వేశాలు మాత్రం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ వర్కర్లు ఎటువంటి సెలవులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్ని రకాల సెలవులు ఇవ్వాలని కోరారు.దహన సంస్కారాలు నిమిత్తం ఖర్చులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఆశా వర్కర్లకు నాణ్యమైన మొబైల్స్ యూనిఫామ్ అందించాలని విజ్ఞప్తి చేశారు. చట్టప్రకారం ఆశ వర్కర్లు అందరికీ గ్రాట్యూటీ అమలు చేయాలని కోరారు. తక్షణమే ఈ సమస్యలు పరిశీలించాలా ప్రభుత్వం తగిన నిర్ణయాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం. ఇస్సాకు, సునీత, సువర్ణ,మురళి, గీతా భవాని, విజయ, కమలా తదితరులు నాయకత్వం వహించారు.
కే బాలశౌరి బ్యూరో ఏలూరు ఏలూరు జిల్లా