BREAKING
వడ్డే ఓబన్న జీవితాన్ని పాఠ్యాంశంగా ముద్రించాలి రాజరాజేశ్వరి అమ్మవారి హుండీ ఆదాయం రూ. 35.90 లక్షలు 8న రాష్ట్ర హోం శాఖ,విపత్తు నిర్వహణ శాఖల మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారి టూర్ షెడ్యూల్ ఖనిజ సంపద అన్వేషణకు డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో శ్రీకారం రెండు వారాలు ముందుగానే థియేటర్లలోకి వస్తున్న నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్ ‘క్రేజీ కల్యాణం’.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు! కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి. బిజెపి జిల్లా అధ్యక్షులు. ప్రపంచ స్థాయిలో ఎస్వీయూ అధ్యాపకుల అరుదైన ఘనత రష్యాలోని ప్రముఖ ప్లేగ్ పరిశోధనా కేంద్రంలో విషాదం ఐరాసలో గళమెత్తిన అరకు ఎంపీ.. భారత్ తరఫున కీలక ప్రసంగం -ఐక్యరాజ్యసమితి వేదికపై భారత్ తరఫున ప్రసంగించిన అరకు ఎంపీ తనుజారాణి దసరా మహోత్సవాలకు జిల్లా కలెక్టర్కు ఆహ్వానం జర్మనీలో సంచలన విజయం సాధించినా ప్రభుత్వ ఏర్పాటులో అడుగు ముందుకు పడని ఏఎఫ్‌డీ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మేఘాంశ్ శ్రీహరి సినిమా! స్త్రీ ఆత్మబలం దేశ భవిష్యత్తుకు పునాదని నమ్మిన వ్యక్తి చంద్రబాబు. గొట్టిపాటి లక్ష్మి. శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో ఘనంగా వరుణ యాగం చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో జోకోవిచ్ జైత్రయాత్ర

వర్షాలు విస్తారంగా కురవాలి-వరుణ యాగంలో మంత్రి నారాయణ .

Select Suryaa Now
వర్షాలు విస్తారంగా కురవాలి-వరుణ యాగంలో మంత్రి నారాయణ .

ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావం   రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వరుణ యాగాలు: మంత్రి   

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్  :  రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురిసి జలాశయాలు నిండాలని, రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ పొంగూరు నారాయణ ఆకాంక్షించారు. మంగళవారం నెల్లూరు సిటీ మూలాపేటలోని శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవస్థానంలో నిర్వహించిన వరుణ యాగంలో మంత్రి నారాయణ తన కుమార్తె షరణితో కలిసి పాల్గొన్నారు. యాగంలో పూర్ణాహుతి సమర్పించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని, దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. సాధారణంతో పోలిస్తే వర్షపాతం 54 శాతం తక్కువగా నమోదైందని చెప్పారు.ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై వర్షాభావ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు.  ఇటీవల కురిసిన వర్షాలతో ఉత్తరాంధ్రలో పరిస్థితి కొంత మెరుగుపడిందని తెలిపారు. అయితే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు సాగు చేసుకునేందుకు అవసరమైన నీరు అందుబాటులోకి రావాలని, ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండాలని ప్రార్థించానన్నారు.రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వరుణ యాగాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అడిషనల్‌ కమిషనర్‌ జనార్ద న్‌, ఈవో జానకి, ఆలయ చైర్మన్‌ వేలూరు పెంచలరాజు, డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌, నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాళ్లపాక అనూరాధ, డివిజన్‌ టీడీపీ నేతలు గండవరం నాని, అన్నంగి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.