BREAKING
ఖనిజ సంపద అన్వేషణకు డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో శ్రీకారం రెండు వారాలు ముందుగానే థియేటర్లలోకి వస్తున్న నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్ ‘క్రేజీ కల్యాణం’.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు! కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి. బిజెపి జిల్లా అధ్యక్షులు. ప్రపంచ స్థాయిలో ఎస్వీయూ అధ్యాపకుల అరుదైన ఘనత రష్యాలోని ప్రముఖ ప్లేగ్ పరిశోధనా కేంద్రంలో విషాదం ఐరాసలో గళమెత్తిన అరకు ఎంపీ.. భారత్ తరఫున కీలక ప్రసంగం -ఐక్యరాజ్యసమితి వేదికపై భారత్ తరఫున ప్రసంగించిన అరకు ఎంపీ తనుజారాణి దసరా మహోత్సవాలకు జిల్లా కలెక్టర్కు ఆహ్వానం జర్మనీలో సంచలన విజయం సాధించినా ప్రభుత్వ ఏర్పాటులో అడుగు ముందుకు పడని ఏఎఫ్‌డీ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మేఘాంశ్ శ్రీహరి సినిమా! స్త్రీ ఆత్మబలం దేశ భవిష్యత్తుకు పునాదని నమ్మిన వ్యక్తి చంద్రబాబు. గొట్టిపాటి లక్ష్మి. శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో ఘనంగా వరుణ యాగం చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో జోకోవిచ్ జైత్రయాత్ర ఐరాసలో గళమెత్తిన అరకు ఎంపీ. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 48,463 మంది ఓటర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ గరివిడి లక్ష్మి ట్రైలర్ అద్భుతంగా ఉంది.. ఇది థియేటర్లలో సెలబ్రేట్ చేసుకునే సినిమా: అడివి శేష్

కలికిరిలో లాంఛనంగా సీనియర్ సిటిజన్ యూనిట్ ప్రారంభం

Select Suryaa Now
కలికిరిలో లాంఛనంగా సీనియర్ సిటిజన్ యూనిట్ ప్రారంభం


- నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవం
- హాజరైన అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎన్.మునిగోపాలకృష్ణ 
మదనపల్లె : అన్నమయ్య జిల్లా,పీలేరు నియోజకవర్గం,కలికిరిలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన యూనిట్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది.ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్.మునిగోపాలకృష్ణ ఎన్నికల అధికారిగా,పిసీ తిమ్మయ్య ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు.కలికిరి మండల యూనిట్ అధ్యక్షుడిగా సురేంద్ర రెడ్డి,కార్యదర్శిగా శివరామిరెడ్డి,కోశాధికారిగా వెంకటరమణ,ఉపాధ్యక్షులుగా గంగిరెడ్డి,జాయింట్ సెక్రటరీగా రమాదేవి,గిరి ఈసీ మెంబర్లుగా పదిమందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా మునిగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతినెల సమావేశంలో నిర్వహించాలని,ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా కేంద్రమైన మదనపల్లిలో అధ్యక్షులు,కార్యదర్శి జిల్లా సమావేశాలకు హాజరు కావాలని,సభ్యుల చేత చెల్లింపబడినటువంటి డబ్బును బ్యాంకులో జమ చేసి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.నూతనంగా సభ్యులందరినీ ఎక్కువ మందిని చేర్పించాలని కోరారు.అనంతరం నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి కృషిచేస్తామని,మెరుగైన సేవలు అందించి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మునిగోపాలకృష్ణకు సహాయ,సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.ఎన్నికల పరిశీలకులు,ఎన్నికలు అధికారి సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.