BREAKING
సైబర్ నేరగాళ్లపై మెగా వేట.. 100 మందికి పైగా అరెస్ట్! విశాఖ నేవీపై పాక్‌ ‘హనీట్రాప్‌’ వల! పాకిస్థాన్‌కు రహస్యాలు లీక్.. 10 రాష్ట్రాల్లో సోదాలు గిద్దలూరు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం - ఎమ్మెల్యే ముత్తుముల పేకాట స్థావరంపై అశ్వరావుపేట పోలీసుల మెరుపు దాడి ఆటో యూనియన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ విజయం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ క్లీన్ ఎనర్జీ దిశగా ఏపీ దూకుడు.. విద్యుత్ రంగంపై మంత్రి గొట్టిపాటి ఫోకస్ ! ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యం -చేర్యాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన నిందితుడు పై పీడీ యాక్ట్ కేసు నమోదు సురక్షితమైన బాల్యం.... నిరంతర విద్య అప్పు చేసి మరీ ఐఫోన్లు కొనకండి.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్! *అట్య-పట్య రాష్ట్ర క్రీడలకు కరీంనగర్ 'సాన్వి' విద్యార్థులు జూనియర్ కళాశాల లేఖను ఇబ్రహీం కి అందించిన మధుసూదన్ నాయుడు ! దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్ కేటుగాళ్ల వేట.. 100 మందికి పైగా అరెస్ట్ 22ఏ జాబితా నుండి తొలగింపునకు 517 అర్జీలు అందగా వాటిలో 217 అర్జీలు ఆమోదించమo జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

హామీ కాదు.. పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం: పొంగులేటి

Select Suryaa Now
హామీ కాదు.. పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం: పొంగులేటి

ఏడాదిలోపే ఇందిరమ్మ టవర్స్‌ పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు: శ్రీధర్‌బాబు
5,218 మంది అర్హుల నుంచి లక్కీ డ్రా.. 480 కుటుంబాలకు ఇళ్ల కేటాయింపు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:
పేదల సొంతింటి కలను కేవలం హామీలకే పరిమితం చేయకుండా కార్యరూపంలోకి తీసుకువస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం గాజులరామారంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ నిర్మాణానికి మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ఇళ్ల కోసం 7 వేల మందికి పైగా దరఖాస్తులు రాగా, పరిశీలన అనంతరం 5,218 మంది అర్హులుగా తేలినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. వీరిలో బహిరంగ లక్కీ డ్రా ద్వారా 480 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయించినట్లు వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఆన్‌లైన్‌ విధానంలో పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు.ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణాలను వేగంగా, నాణ్యతతో పూర్తి చేసి ఏడాదిలోపే లబ్ధిదారులకు ఇళ్లను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. నిర్ణీత గడువుకు ముందే నిర్మాణాలు పూర్తి చేసే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలు అందిస్తామని, నెల ముందుగా పూర్తి చేస్తే రూ.45 లక్షలు, రెండు నెలలు ముందుగా పూర్తి చేస్తే రూ.90 లక్షల ప్రోత్సాహకం ఇస్తామని వెల్లడించారు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న సుమారు 7.5 ఎకరాల స్థలంతోపాటు ఇతర ప్రభుత్వ, హౌసింగ్‌ శాఖ భూములను గుర్తించి తదుపరి విడతల్లోనూ ఇళ్ల నిర్మాణం చేపడతామని పొంగులేటి తెలిపారు. కుత్బుల్లాపూర్‌లో కేటాయించిన 480 ఇళ్లతో కార్యక్రమం ముగియదని, మరో మూడు విడతల్లో కూడా ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని చెప్పారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణాలను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసి ఏడాదిలోగా లబ్ధిదారులకు అందించేందుకు పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్‌ మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణంతోపాటు లబ్ధిదారులకు అవసరమైన మౌలిక వసతులు, ప్రార్థనా మందిరాలు, వైకుంఠధామాల కోసం స్థలాలు ఏర్పాటు చేయాలని కోరారు. సంబంధిత శాఖల సమన్వయంతో సమగ్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు.ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. లబ్ధిదారులు నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. నాణ్యమైన ఇళ్లను సొంతం చేసుకున్నామనే సంతృప్తి లబ్ధిదారులకు కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బొంగునూరి శ్రీనివాసరెడ్డి, హౌసింగ్‌ శాఖ కార్యదర్శి వి.పీ. గౌతమ్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌ మిక్కిలినేని మను చౌదరి తదితరులు పాల్గొన్నారు.

పన్నాల బాల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి.