BREAKING
శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన తెగిపోయిన చేతికి మళ్లీ ప్రాణం… పీఎంశ్రీ పాఠశాలల్లో.. ప్రత్యేక అతిథి విద్యాబోధకుల నియామకం ఆటో ద్విచక్ర వాహనం ఢీ ఒకరికి గాయాలు.... చిగురుకోట జడ్పీ హైస్కూల్ ను పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్ దండే లక్ష్మి పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన కనిగిరి చేరిన బ్యాలట్ బాక్స్ లు కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి కొత్త చిత్రం హైకూ ట్రైలర్ రిలీజ్.. అక్టోబర్ 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్! జోగింపేట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించిన ఏవో ఎస్ అవినాష్ అయోడిన్ లోపంతో పిల్లల ఎదుగుదలపై ప్రభావం శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో వరుణయాగం వరిలో ఎద పద్ధతితో సాగు ఖర్చు తగ్గుతుంది ... ఏవో ఎస్ అవినాష్.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన నిందితుడు పై పీడీ యాక్ట్ కేసు నమోదు

Select Suryaa Now
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన నిందితుడు పై పీడీ యాక్ట్ కేసు నమోదు

-కడప సెంట్రల్ జైలుకు తరలింపు 
ఆత్మకూరు, మేజర్ న్యూస్  :    పలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి పలుకేసుల్లో శిక్ష కూడా గతంలో అనుభవించిన ఉదయగిరి వెంకటేశ్వర్లు అనే నిందితులపై పీడీ యాక్ట్ చట్టం కేసు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు పంపామని గంగాధర్ పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన ఉదయగిరి వెంకటేశ్వర్లు గతంలో గంజాయి తదితర అసాంఘిక కార్యకలాపాల రెండు కేసుల్లో నిందితుడు కాగా పలు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కరుడుగట్టిన నిందితుడిగా ఉన్న వెంకటేశ్వర్లు పై పి. డి చట్టం కేసు నమోదు చేశామని, కడప సెంట్రల్ జైలుకు తరలించామని సిఐ గంగాధర్ పేర్కొన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ గంగాధర్ హెచ్చరించారుm ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్సై జంపాని కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.