స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్
నారాయణ ఈ-టెక్నో స్కూల్‌లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్
అవనిగడ్డ, మేజర్ న్యూస్ స్థానిక నారాయణ ఈ-టెక్నో స్కూల్‌లో 1, 2 తరగతుల విద్యార్థులకు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్‌ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు విద్యా సంవత్సరం ప్రథమార్థంలో నేర్చుకున్న అంశాలను వివిధ మోడల్స్, ప్రాజెక్టుల రూపంలో తల్లిదండ్రుల సమక్షంలో వివరించారు. తమ పిల్లల ప్రతిభను చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సీహెచ్ బాబురావు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఈ-చాన్స్ కోఆర్డినేటర్ లియోని, ఏవో సుబ్రహ్మణ్యం, ఇన్‌చార్జి తలుపుల నాగలక్ష్మి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.-అజంతా శ్రీనివాస్ అవనిగడ్డ