BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు !

Select Suryaa Now
తిరుమలలో  వీఐపీ దర్శనాలు రద్దు !

-బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ కీలక నిర్ణయాలు

-11 నుంచి 20 వరకు ప్రివిలేజ్డ్‌ దర్శనాలకు బ్రేక్‌

-10 నుంచి 19 వరకు సిఫార్సు లేఖలు స్వీకరణ బంద్‌

-రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నేడు ఉదయం 10 గంటలకు విడుదల

ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు వీఐపీ బ్రేక్‌, ప్రివిలేజ్డ్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ దర్శనం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ వెల్లడించింది. వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలతో పాటు చంటిపిల్లల తల్లిదండ్రుల దర్శనాలను కూడా పది రోజుల పాటు రద్దు చేసినట్లు తెలిపింది. ఎన్అర్ఐ, డిఫెన్స్‌ దర్శనాలను సైతం రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

రూ.300 దర్శనం టికెట్లు  నేడు విడుదల

శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 12, 13, 14, 18, 19, 20వ తేదీలకు సంబంధించిన టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. రోజుకు 10 వేల టికెట్ల చొప్పున మొత్తం టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో.. దర్శనాలు, వసతి, రవాణా తదితర అంశాల్లో రద్దీని నియంత్రించేందుకు టీటీడీ ముందస్తు చర్యలు చేపడుతోంది.

తిరుపతిలో అధికారుల తనిఖీలు.. 18 వాహనాలు స్వాధీనం

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుపతి నగర ట్రాఫిక్‌ పోలీసులు, జిల్లా రవాణా శాఖ అధికారులు మంగళవారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ బస్టాండ్‌ పరిసరాల్లో ఆటోలు, సుమోలు, జీపులపై ప్రత్యేక నిఘా పెట్టారు.ప్రయాణికుల మాదిరిగా మారువేషాల్లో వెళ్లి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న వాహనాలను గుర్తించిన అధికారులు చర్యలు చేపట్టారు. తనిఖీల్లో 13 ఆటోలు, 3 సుమోలు, 2 జీపులు.. మొత్తం 18 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయా వాహనాలకు కలిపి సుమారు రూ.లక్ష జరిమానా విధించారు.అధిక ఛార్జీలు వసూలు చేయడం, ఓవర్‌లోడింగ్‌, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్‌ లైసెన్స్‌లు లేకపోవడం, అవసరమైన పర్మిషన్లు లేకుండా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని అధికారులు వెల్లడించారు.