దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్ కేటుగాళ్ల వేట.. 100 మందికి పైగా అరెస్ట్
హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో సైబర్ నేరగాళ్లపై బ్యూరో బృందాలు భారీ స్థాయిలో ఆపరేషన్ నిర్వహించాయి. దాదాపు రెండు వారాల పాటు సాగిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా 100 మందికి పైగా సైబర్ కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సోదాల్లో నిందితుల నుంచి భారీ సంఖ్యలో డెబిట్ కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్‌లతో పాటు కీలకమైన కేవైసీ (KYC) డాక్యుమెంట్లను సైబర్ క్రైమ్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. అమాయక ప్రజల నుండి కేవైసీ వివరాలు సేకరించి, వాటితో నకిలీ బ్యాంక్ ఖాతాలు తెరిచి కోట్లాది రూపాయల సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. అరెస్టయిన వారిలో కేవైసీ పత్రాలు అందిస్తున్న దళారులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి కేసు నమోదు చేసి మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ మరియు విజయవాడ ప్రాంతాల్లో డిజిటల్ అరెస్ట్ పేరిట జరిగిన రూ. 10 కోట్ల భారీ సైబర్ మోసానికి సంబంధించిన పూర్తి కథనం మరియు వివరాలను ఈ Vijayawada Cyber Scam Video లో చూడవచ్చు.