విద్యుత్ సేవా సేతు కార్యక్రమం..
ములకలచెరువు మండల కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆదేశాల మేరకు అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో “సేవా సేతు అభియాన్" క్యాంపులను నిర్వహించనున్నట్లు జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ సోమశేఖర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ“ప్రతి ఇంటికి సౌర విద్యుత్ను చేరువ చేయడం, రూప్టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించడమే సేవా సేతు అభియాన్ ప్రధాన ఉద్దేశ్యం" అని తెలిపారు. ఇంటి పైకప్పుపై సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా అర్హత కలిగిన గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందన్నారు.78 వేల వరకు సబ్సిడీ3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్ఠంగా రూ.78,000వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. క్యాంపుల్లో పూర్తి సమాచారం “సేవా సేతు అభియాన్” క్యాంపుల ద్వారా ప్రజలకు పథకం అర్హతలు, దరఖాస్తు విధానం, సబ్సిడీ పొందే ప్రక్రియ, రూఢాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు, నెట్ మీటరింగ్ తదితర అంశాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ఈఈ గంగాధరం,డివైఈఈ గోవిందరెడ్డి,ఏఈఈ శేషకుమార్,సురేంద్ర మరియు సిబ్బంది, కూటమి నాయకులు, వినియోగదారులు, తదితరులు పాల్గొన్నారు.
పాలగిరి. గౌరీ శంకర్ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్