పోషణ మాసోత్సవాలు అంగన్వాడీ ఉత్సవం ఘనంగా ముగింపు
రేపల్లె, మేజర్ న్యూస్; మన అంగన్వాడీ మన బాధ్యత” అనే సందేశంతో తల్లి, శిశు పోషణ, ఆరోగ్యం, పరిశుభ్రత అంగన్వాడీ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించామని సిడిపిఓ ఎం సుచిత్ర తెలిపారు బుధవారం రేపల్లె ప్రాజెక్టు పరిధిలో పోషణ మాసోత్సవాలు 2026 అంగన్వాడీ ఉత్సవం ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సి డి పి ఓ సుచిత్ర మాట్లాడుతూ పోషణ మాసోత్సవాల్లో భాగంగా సమతుల్య పోషకాహారం, గర్భిణీలు బాలింతల ఆరోగ్యం, తల్లిపాల ప్రాముఖ్యత, ఆరు నెలల తర్వాత అదనపు పోషకాహారం, రక్తహీనత నివారణ, పిల్లల ఎదుగుదల పర్యవేక్షణ, పరిశుభ్రత ఆరోగ్యకరమైన జీవన విధానం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న వివిధ సేవలను తల్లులు ప్రజలకు వివరించారు.అంగన్వాడీ ఉత్సవం సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు అందిస్తున్న సేవలను అభినందిస్తూ, అంగన్వాడీ కేంద్రాలను పిల్లలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన ఆహ్లాదకరమైన వాతావరణంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ సందర్భంగా రేపల్లె ప్రాజెక్టు కార్యాలయంలో పనిచేస్తున్న కార్యాలయ సిబ్బంది, సూపర్‌వైజర్లు ఉత్తమ సేవలు అందించిన ఉత్తమ అంగన్వాడీ కార్యకర్తలకు అవార్డులు అందజేసి సత్కరించారు. ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు హిమబిందు, సునీత, రాధిక, జ్యోతి లక్ష్మి, వెంకట రమణ, నాగలక్ష్మి, ఎల్‌డీసీ మణిశంకర్, డీఈఓలు సుమన్, నిర్మల బీపీసీ అరుణ తదితరులు పాల్గొన్నారు.