ముక్కిడి దేవత గుడికి రేకులు షెడ్డు కు వితరణ
కొత్తూరు సూర్య: కొత్తూరు మండల కేంద్రానికి సమీపంలో గల శ్రీ ముక్కిడి పోలమ్మ గుడికి భక్తులు సౌకర్యార్ధం కోసం రేకులు షెడ్డు నిర్మాణానికి సామాజిక వేత్త ఎంపిహెచ్ డవలపర్స్ అధినేత బామిడి రాజు ఆలయ కమిటీ కి విరాళం అందజేశారు. భక్తుల ఇబ్బందులను ఆలయ కమిటీ సభ్యులు సామాజిక వేత్త బామిడి రాజు దృష్టికి తీసుకొని వెళ్లగా షెడ్ నిర్మాణానికి రాజు అంగీకరించి నిధులు అందజేశారు. రాజు తరుపున ఒండ్రుజోల గ్రామ పెద్దలు నిమ్మగడ్డ కృష్ణ మూర్తి,బామిడి సుందరరావు,ముద్దాడ సుందరరావు, కమిటీ సభ్యులు సీతంపేట దేశం పార్టీ మండల కమిటీ అధ్యక్షులు తోట ముఖలింగం కు విరాళం నగదు అందజేశారు. గిరిజనులు ఆరాధ్యదైవంగా కొలుస్తున్న ముక్కిడి దేవత గుడికి రేకుల షెడ్ నిర్మించేందుకు సహాయం చేసిన బామిడి రాజు కృతజ్ఞతలు తెలియ జేశారు.