BREAKING
తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు రోజంతా సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో జరిగే అనర్థాలు ఇవే.. డీహైడ్రేషన్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మన్నెమాల సుకుమార్‌రెడ్డిగారిని మర్యాదపూర్వకంగా కలిసిన దగదర్తి మండల జనసేన శ్రేణులు

Select Suryaa Now
మన్నెమాల సుకుమార్‌రెడ్డిగారిని మర్యాదపూర్వకంగా కలిసిన దగదర్తి మండల జనసేన శ్రేణులు

నెల్లూరు, మేజర్ న్యూస్ : ​కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల జనసేన పార్టీలో చేరిన సీనియర్ రాజకీయ నాయకులు మన్నెమాల సుకుమార్‌రెడ్డిని దగదర్తి మండలానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు.
​దగదర్తి మండల మాజీ కన్వీనర్ తాళ్లూరి వెంకట్ యాదవ్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది ముఖ్య నాయకులు మరియు క్రియాశీలక కార్యకర్తలు కావలిలోని మన్నెమాల సుకుమార్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. పార్టీ తీర్థం పుచ్చుకున్న అనంతరం తొలిసారి ఆయన్ను కలిసిన నాయకులు, ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
​ఈ సందర్భంగా తాళ్లూరి వెంకట్ యాదవ్ మాట్లాడుతూ, సీనియర్ నాయకులు సుకుమార్‌రెడ్డి పార్టీలోకి రావడం నియోజకవర్గంలో జనసేన శ్రేణులకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని, దగదర్తి మండలంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
​అనంతరం మన్నెమాల సుకుమార్‌రెడ్డి మాట్లాడుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ గారి ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తనపై నమ్మకంతో కలిసి వచ్చిన దగదర్తి మండల నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దగదర్తి మండలానికి చెందిన పలువురు జనసేన నాయకులు,జనసైనికులు పాల్గొన్నారు.