BREAKING
అగ్రికల్చర్ విద్యార్థునీల విద్య క్షేత్ర పర్యటన... పోస్టల్ బ్యాంక్ ఖాతాలో పెన్షన్ డిబిటి నగదు జమ... దుగరాజపట్నంలో షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయండి రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూమ్ లు పరిశీలన రీ సర్వే అభ్యంతరాల పై సమావేశం.... ఎంఈఓ పనితీరుపై ఎంపీడీవో కు యుటిఎఫ్ నాయకులుఫిర్యాదు డి-పట్టా రైతులకు న్యాయం చేయాలి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి 24 గంటలు పనిచేయని ఆసుపత్రి ఆర్ఈసీఎస్ లో ఏం జరుగుతుందో? ఆనంద్ బ్రహ్మ అకాడమీ ద్వారా విద్యార్థులు కు ఉచిత శిక్షణ: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల పరిశీలన సీజేపీ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం: మడ్డువలస ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన జిల్లాఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్

ఎర్రకాలువ మిగులు భూముల్లో పేదలకు పట్టాలు ఇవ్వాలివ్యకాసం డిమాండ్

Select Suryaa Now
ఎర్రకాలువ మిగులు భూముల్లో పేదలకు పట్టాలు ఇవ్వాలివ్యకాసం డిమాండ్

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్ఎర్రకాలువ ప్రాజెక్టు మిగులు భూముల్లో సాగు చేసుకుంటున్న భూమిలేని పేదలు, దళితులు, గిరిజనులకు పట్టాలు ఇచ్చి సాగు హక్కులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం డివిజనల్ ఇరిగేషన్ కార్యాలయం వద్ద బుధవారం సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 15 ఏళ్లుగా పేదలు హక్కుల కోసం పోరాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పేదలు సాగు చేస్తున్న పంటలకు రక్షణ కల్పించాలని, ఇరిగేషన్ భూముల్లో అక్రమ మట్టి తరలింపు, చెట్ల నరికివేతకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దళిత, గిరిజన మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు మాట్లాడుతూ పేదలు, దళితులు, గిరిజనులకు భూములపై హక్కులు కల్పించాలని కోరారు. అనంతరం ఇరిగేషన్ ఏఈ అనిల్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఏఈ హామీ ఇచ్చారు.

 రిపోర్టర్ కె.వి.రమణరావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా