BREAKING
తెలంగాణలో కొత్త జిల్లాల దశాబ్ది ఉత్సవాలు: రెండు రోజుల పాటు కార్యక్రమాలకు కేటీఆర్ పిలుపు! అమెరికా షేర్ మార్కెట్లోకి పేట్రియాట్ మొబైల్ ఖమ్మంలో మంత్రుల బిజీ బిజీ పర్యటన.. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలపై కసరత్తు! కొడంగల్‌లో వ్యవసాయ శాఖ పోస్టుల భర్తీ వెనిజులాలో స్టార్‌లింక్ సేవలకు గ్రీన్ సిగ్నల్ ఫ్లోరిడాను వణికించిన ఇసయాస్ హరికేన్ నార్వేపై డోనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం...నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవడంపై విమర్శలు చైనా చర్యలు అత్యంత ప్రమాదకరమంటూ అమెరికా తీవ్ర హెచ్చరిక ఢిల్లీలో భారీ ఉద్రిక్తత...హైఅలర్ట్‌లో రాజధాని ఓటీటీని ఊపేస్తున్న సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ సిరీస్ 'ఖౌఫ్'! కండక్టర్ రోజులను తలుచుకుని రజనీకాంత్ ఎమోషనల్.. 'జైలర్ 2' వేదికగా సంచలన కామెంట్స్! పండుగ ముందే పసిడి బాంబ్.. ఆకాశాన్నంటిన బంగారం, వెండి ధరలు! ముచ్చింతల్‌లో వైభవంగా 'సుందర విజయం' సమాప్తి... దివ్యసాకేత క్షేత్రంలో ప్రత్యేక పూజలు బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ, తమిళనాడు వైపు పయనం! శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా..

దుగరాజపట్నంలో షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయండి

Select Suryaa Now
దుగరాజపట్నంలో షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయండి

కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్‌ను కోరిన సీఎం చంద్రబాబు

సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి : 

 ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర ఆధారిత ఆర్థిక కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి, మూలపేట పోర్టులో టెర్మినల్‌ ఏర్పాటు, దుగరాజపట్నంలో షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోర్టుల ఆధారంగా పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని సీఎం వివరించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత పోర్టులకు అనుసంధానంగా షిప్‌ బిల్డింగ్‌, షిప్‌ రిపేర్‌, మెరైన్‌ ఇంజినీరింగ్‌ వంటి రంగాలను అభివృద్ధి చేస్తే పెద్దఎత్తున ఉపాధి, పెట్టుబడులకు అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు అభివృద్ధితో ఉత్తరాంధ్రలో వాణిజ్య కార్యకలాపాలు మరింత ఊపందుకుంటాయని సీఎం పేర్కొన్నారు. పోర్టుకు అవసరమైన టెర్మినల్‌, అనుబంధ మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరారు. మూలపేట పోర్టును కేవలం సరకు రవాణా కేంద్రంగా మాత్రమే కాకుండా పరిశ్రమలు, లాజిస్టిక్స్‌, ఎగుమతులు, సముద్ర ఆధారిత తయారీ రంగాలకు కీలక హబ్‌గా తీర్చిదిద్దే అవకాశం ఉందని, కేంద్రం సహకరించాలని సీఎం కోరారు. దుగరాజపట్నంలో షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. నౌకల నిర్మాణంతో పాటు మరమ్మతులు, నిర్వహణ, మెరైన్‌ పరికరాల తయారీకి అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహిస్తే రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక ఎకోసిస్టమ్‌ ఏర్పడుతుందని తెలిపారు. అవసరమైన భూమి, మౌలిక వసతులు, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం తెలిపారు.