మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వరంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు.
ముమ్మిడివరం, మేజర్ న్యూస్ :డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఎస్.వి ఫంక్షన్ హాల్ నందు జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ బాలిక దినోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్యఅతిథిగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సాధికారిక అధికారిని కె. నాగమణి, ఏపీ ఎస్సీ పిసిఆర్ నెంబర్ డాక్టర్ నాగ మానస , ఎస్సీ పిసిఆర్ నెంబర్ గంగాసూర్యనారాయణ ,జిల్లా మెడికల్ ఆఫీసర్ ఆర్డి ప్రతాప్, జిల్లా నందు ఆరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓస్, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ ఎం. నిహారిక, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది వారు బాలికలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది ఈ సందర్భంగా శిశు సంక్షేమ శాఖ అధికారి కె. నాగమణి మాట్లాడుతూ బాలికలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, మొదట బాలికను పుట్టనిద్దాం తరువాత పెరగనిద్దాం ఎదగనిద్దాం బాలికలను చదవనిద్దాం అని బాలికల గురించి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది
తదుపరి జిల్లా మెడికల్ ఆఫీసర్ వారు బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ బాలికలు విద్యలో ముందు ఉండాలని ఆరోగ్యంలోనూ జాగ్రత్తలు పాటించాలని సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని తెలియజేసారు. అనంతరం , చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ విమల కుమారి, మాట్లాడుతూ బాలికలు ఉజ్వల భవిష్యత్తును అభివృద్ధి చెందే దిశగా తీర్చిదిద్దాలని ఎక్కడికి వెళ్ళినా భద్రతను మన భద్రత మనమే కాపాడుకోవాలని జిల్లా నందు ఉన్న ప్రతి బాలుడు ప్రతి బాలిక ఈ బాలల హక్కుల పైన అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు
ఎస్సీ పిసిఆర్ నెంబర్ డాక్టర్ నాగ మానస మాట్లాడుతూ ఈ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రతి బాలిక అన్ని రంగాలలోనూ బాలికలు ముందుండాలని 18 సంవత్సరాలు వయస్సు నిండిన తర్వాతే వివాహం చేసుకోవాలని బాల్య వివాహం చేస్తుంటే కచ్చితంగా దాన్ని చేసుకోమని ధైర్యముతో ముందుకొచ్చి నిలబడాలని ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇంతమంది అధికారులు ఉన్నప్పుడు ఎవరో ఒకరికి తెలియజేయమని తెలిపి ఉన్నారు, ఎస్సీ పిసిఆర్ నంబర్ సూర్యనారాయణ మాట్లాడుతూ బాలికలకు ఉన్నతమైన భవిష్య త్తు బాల్య వివాహాలు జరగకూడదని వారికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించిన శక్తివంతంగా ఉండాలని సూచించినారు జిల్లా మిషన్ కోఆర్డినేటర్ ఎం. నిహారిక బాలికలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక సూపర్వైజర్లు, డీసీపీయు g సిబ్బంది, చైల్డ్ హెల్ఫ్ లైన్ సిబ్బంది, అంగనవాడి సిబ్బంది, మరియు బాలికలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.