BREAKING
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా.. మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి..:బ్రాహ్మణ పెద్దల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం.. రైల్వే ట్రాక్ మార్గాన్ని పునఃపరిశీలించండి..:ఎమ్మెల్యే ఆనందరావుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి.. ముమ్మిడివరంలో 24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె: స్పందించని ప్రభుత్వం.. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వరంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి 52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి. పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు

మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి..:బ్రాహ్మణ పెద్దల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం..

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి..:బ్రాహ్మణ పెద్దల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం..

అమలాపురం  మేజర్ న్యూస్ మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని బ్రాహ్మణ పెద్దలు ఏకగ్రీవంగా తీర్మానించారు. అమలాపురం పట్టణంలోని ఏఎస్ఎన్ కళాశాల ఎదురుగా ఉన్న రాజ్యలక్ష్మి అపార్ట్‌మెంట్‌లో ఆదివారం సాయంత్రం రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఆకెళ్ల నారాయణమూర్తి అధ్యక్షతన పట్టణానికి చెందిన బ్రాహ్మణ పెద్దలు సమావేశం నిర్వహించారు.*

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా రాజకీయ, సామాజిక రంగాల్లో వ భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో నలుగురు బ్రాహ్మణులకు కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. రాజకీయ పార్టీలు బ్రాహ్మణ పెద్దల అభ్యర్థనను సానుకూలంగా పరిగణించి, రాబోయే ఎన్నికల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి రాణి శ్రీనివాస శర్మ, కొత్తూరి శ్రీనివాస్, అడ్వకేట్ దుర్గాబాబి, కళా వెంకట్రావు, ఉప్రదిష్ట నాగాదిత్య, ఆత్కూరి శేషగిరి, చల్లా రామకృష్ణ తదితర బ్రాహ్మణ ప్రముఖులు, పెద్దలు పాల్గొన్నారు.*