BREAKING
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా.. మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి..:బ్రాహ్మణ పెద్దల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం.. రైల్వే ట్రాక్ మార్గాన్ని పునఃపరిశీలించండి..:ఎమ్మెల్యే ఆనందరావుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి.. ముమ్మిడివరంలో 24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె: స్పందించని ప్రభుత్వం.. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వరంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి 52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి. పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు

శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా..

Select Suryaa Now
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా..

అమలాపురం,  మేజర్ న్యూస్ జిల్లాలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమలాపురంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ క్రైమ్ రివ్యూ సమావేశంలో ఎస్డీపీవోలు, సీఐలు, ఎస్సైలతో నేరాల పరిస్థితి, కేసుల పురోగతిపై సమీక్షించారు.సీసీటీఎన్‌ఎస్ డేటా ఆధారంగా కేసుల స్థితిగతులను పరిశీలించి, మూడేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

 డ్రోన్లు, 112 అత్యవసర సేవలు, ఈ-సాక్ష్య, సీఈఐఆర్, మెడ్లీపీఆర్ అప్లికేషన్లను సమర్థంగా వినియోగించాలని, రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచి పెండింగ్ వారెంట్ల అమలును వేగవంతం చేయాలని ఆదేశించారు.రానున్న మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని ఎస్పీ సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు, ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా భద్రత కల్పించాలన్నారు. 

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.రాబోయే పండుగలు, జాతరల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సోషల్ మీడియాపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. 

రాత్రి గస్తీ పెంచడంతోపాటు సామరస్య కమిటీల ద్వారా ప్రజల్లో శాంతి, సామరస్యాన్ని పెంపొందించాలని కోరారు. డిసెంబర్ 12న జరగనున్న లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు