BREAKING
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా.. మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి..:బ్రాహ్మణ పెద్దల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం.. రైల్వే ట్రాక్ మార్గాన్ని పునఃపరిశీలించండి..:ఎమ్మెల్యే ఆనందరావుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి.. ముమ్మిడివరంలో 24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె: స్పందించని ప్రభుత్వం.. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వరంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి 52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి. పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు

పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం

Select Suryaa Now
పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా- పి.గన్నవరం మేజర్ న్యూస్ :మండలంలో పోతవరం గ్రామ పంచాయతీలో వీబీజీ రామ్ పథకం సామాజిక తనిఖీపై అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఏపీఓ సిహెచ్. లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో శ్రామికులు, వీబీజీ రామ్ జీ సిబ్బంది, సామాజిక తనిఖీ బృందం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏపీఓ మాట్లాడుతూ వీబీజీ రామ్ పథకం ఉద్దేశం, ఉపాధి అవకాశాలు, సామాజిక తనిఖీ ప్రాధాన్యత, ప్రజల భాగస్వామ్యం, పారదర్శకత మరియు జవాబుదారీతనం వంటి అంశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి.ప్రతి చేతికి పని పనికి తగ్గ వేతనం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అని అన్నారు.

సామాజిక తనిఖీ బృందం మాట్లాడుతూ వలసలెందుకు దండగ  వీబీజీ రామ్ జీ ఉండగా, మన తనిఖీ - సామాజిక తనిఖీ, సామాజిక తనిఖీలో పాల్గొందాం..గ్రామాభివృద్ధికి తోడ్పడుదాం.. అనే నినాదాలతో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం అంటూ ర్యాలీ నిర్వహించారు.సామాజిక తనిఖీలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి" అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డీఆర్పీలు పి.సత్యనారాయణ, కె.చిట్టిబాబు, ఎం.కిరణ్ కుమార్, కె.రామకృష్ణ, ఎం.మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.