BREAKING
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా.. మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి..:బ్రాహ్మణ పెద్దల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం.. రైల్వే ట్రాక్ మార్గాన్ని పునఃపరిశీలించండి..:ఎమ్మెల్యే ఆనందరావుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి.. ముమ్మిడివరంలో 24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె: స్పందించని ప్రభుత్వం.. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వరంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి 52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి. పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు

ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి

Select Suryaa Now
   ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మేజర్ న్యూస్ :: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువ పరిశోధకుడు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ప్రతిభ చాటారు. ఆదిమూలంవారిపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ తిరుమనాధం ఎన్.ఎస్.కోటి మణికుమార్ ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ విడుదల చేసిన అంతర్జాతీయ 'టాప్ 2% శాస్త్రవేత్తల' జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన అమరావతి సమీపంలోని విట్-ఏపీ (VIT-AP) విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) మరియు ఇమేజ్ ప్రాసెసింగ్ రంగాలలో ఆయన ప్రచురించిన పరిశోధనా పత్రాలు, సైటేషన్ల నాణ్యతకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ రీసెర్చ్ పబ్లిషర్ ఎల్సెవియర్ (Elsevier) మరియు అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా రూపొందించిన 2026 వార్షిక జాబితాలో భారత్ నుంచి మొత్తం 3,898 మంది శాస్త్రవేత్తలు ఎంపిక కాగా, అందులో డాక్టర్ మణికుమార్ స్థానం సంపాదించడం విశేషం.

తమ గ్రామానికి చెందిన వ్యక్తి గ్లోబల్ వేదికపై ఇంతటి ఘనత సాధించడం పట్ల ఆదిమూలంవారిపాలెం గ్రామస్థులు, కుటుంబ సభ్యులు మరియు విద్యావేత్తలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ కోటి మణికుమార్ స్పందిస్తూ.. ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో స్థానం దక్కడం ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ గుర్తింపు భవిష్యత్తులో మరింత నాణ్యమైన పరిశోధనలు కొనసాగించడానికి గొప్ప ప్రేరణగా నిలుస్తుందని, సమాజానికి మేలుచేసే అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆవిష్కరణలపై దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు.