BREAKING
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా.. మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి..:బ్రాహ్మణ పెద్దల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం.. రైల్వే ట్రాక్ మార్గాన్ని పునఃపరిశీలించండి..:ఎమ్మెల్యే ఆనందరావుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి.. ముమ్మిడివరంలో 24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె: స్పందించని ప్రభుత్వం.. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వరంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి 52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి. పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు

Select Suryaa Now
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు ఎక్స్‌పోజర్ విజిట్‌లో భాగంగా 2026 అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం  పోలవరం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు అధికారులు విద్యార్థులకు ప్రాజెక్టు నిర్మాణం యొక్క ప్రాముఖ్యత, నిర్మాణ పనుల పురోగతి, ప్రాజెక్టు ప్రత్యేకతలు, సాగునీటి అవసరాలు తీర్చడంలో ప్రాజెక్టు పోషించే కీలక పాత్ర వంటి అంశాలను వివరించారు. 

ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వివిధ పనులను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా విద్యార్థులకు ఆచరణాత్మక అవగాహన కలిగింది.పుస్తకాల ద్వారా నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఈ సందర్శన ఎంతో ఉపయోగకరంగా నిలిచింది. ఇటువంటి విజ్ఞాన పర్యటనలు విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తాయని ఉపాధ్యాయులు తెలిపారు.

విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వ అధికారులకు విద్యార్థినీ విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేతల విజయ్ కుమార్‌తో పాటు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అవసరమైన సహకారం అందించారు.