BREAKING
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా.. మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి..:బ్రాహ్మణ పెద్దల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం.. రైల్వే ట్రాక్ మార్గాన్ని పునఃపరిశీలించండి..:ఎమ్మెల్యే ఆనందరావుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి.. ముమ్మిడివరంలో 24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె: స్పందించని ప్రభుత్వం.. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వరంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి 52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి. పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు

52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.

Select Suryaa Now
52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.

అమలాపురం మేజర్ న్యూస్ : ఒక్కొక్కరికి రూ. 2.50 లక్షల రుణం మంజూరు.. కూటమి అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు  క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు పత్రాలను అందజేశారు ఈ విడతలో 52 మందికి రూ. 2,50,000 చొప్పున రుణ మంజూరు పత్రాలు అందించగా, ఇప్పటివరకు మొత్తం 200 మందికి పైగా లబ్ధిదారులకు ఈ సహాయం అందించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు  మాట్లాడుతూ... ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ  సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.
గత వైకాపా పాలనలో ఉండేందుకు పనికిరాని అగ్గిపెట్టె లాంటి ఇళ్లను, నీట మునిగే కాలనీల్లో సెంటు పావు స్థలాలిచ్చి పేదలను వంచించారని మండిపడ్డారు. 

కూటమి ప్రభుత్వం వచ్చాక సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని నిరుపేదలను గుర్తించి, ఒక్కొక్కరికి రూ. 2.50 లక్షల వరకు బ్యాంక్ రుణాలు ఇప్పిస్తూ ఆసరాగా నిలుస్తున్నామని తెలిపారు. అమలాపురంలో ప్రతీ అర్హుడికి పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు శ్రమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయలక్ష్మి కూటమి ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు