యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్,
అమలాపురం మేజర్ న్యూస్ :స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని 2027 జాతీయ యువజనోత్సవములలో భాగంగా డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థాయి యువజనోత్సవాలను ఈ రోజు అనగా తేదీ09.10.2026న యువజన సర్వీసుల శాఖ, సెట్రాజ్, కాకినాడ వారి అధ్వర్యంలో యువతీయువకులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి తమ నైపుణ్యములను ప్రదర్శించుకొనుటకు వీలుగా 15-29 సంవత్సరముల మధ్య వయస్సుగల యువతీయువకులకు జానపద నృత్యం బృందం జానపద గేయం బృందం నూక్కడ్ నాటక్ బృందం కవిత్వం వ్రాయడం మరియు పెయింటింగ్ పోటీలను శ్రీయుత జిల్లా కలక్టర్ వారి ఆదేశముల మేరకు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థాయి యువజనోత్సవాలు-2026ను బోనం వెంకట చలమయ్య ఇంజనీరింగ్ కళాశాల, బట్లపాలెం నందు నిర్వహించుట జరిగినది.
జిల్లా స్థాయి యువజనోత్సవములను గౌరవ బోనం వెంకట చలమయ్య ఇంజనీరింగ్ కళాశాల, బట్లపాలెం ఛైర్మన్ శ్రీ బోనం కృష్ణ సతీష్ గారు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంబించినారు. పై పోటీలలో పాల్గొనుటకు విచ్చేసిన వివిధ కళాశాలల విద్యార్థినివిద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుచూ శ్రీ స్వామి వివేకానంద వారిని ఆదర్శముగా తీసుకొని చదువుతోపాటు సాంస్కృతిక, క్రీడా పోటీలు మరియు సామాజిక సేవ కార్యక్రమాలలోనూ పాల్గొనవలసినదిగాపిలుపునిచ్చారు. డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నలుమూలల నుండి ఈ పోటీలలో పాల్గొనడానికి 1004 మంది యువతియువకులు ఆన్ లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకొన్నారు.
ఎ డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ యువజనోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిదిగా పాల్గొని యువత స్వామి వివేకానందవరిని ఆదర్శముగా తీసుకోవాలని, అలాగే దేశాభివృద్దిలో భాగస్వాములు కావాలని అందుకు అనుగుణముగా యువత నైపుణ్యముల అభివృద్ధితోపాటు సాంస్కృతిక మరియు క్రీడా పోటీలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే విధముగా సామాజిక భాద్యతతో మెలగవలెనని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమములో సెట్రాజ్ ముఖ్యకార్యనిర్వహణాధికారి, శ్రీ కె.ఎస్.వి. కాశీ విశ్వేశ్వర రావు, బోనం వెంకట చలమయ్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ జె. వి. జి. రామరావుగారు మరియు న్యాయ నిర్ణేతలు మరియు సెట్రాజ్ సిబ్బంది పాల్గొన్నారు.
పోటీలలో విజేతలు : జానపద నృత్యం (బృందం)లో పవన్ &గ్రూపు, ప్రధమ స్థానం, బేబీ & గ్రూపు ద్వితీయ స్థానం, (2) జానపద గేయాలు (బృందం)లో నాగలక్ష్మి & గ్రూపు ప్రధమ స్థానం, వి. విమలా & గ్రూప్ , ద్వితీయ స్థానం 3 నూక్కడ్ నాటక్ బృందంలో ఫ్యూచర్ స్టార్స్ ప్రధమ స్థానం, గోదావరి ఏకోస్ టీమ్ ద్వితీయ స్థానం, 4 కవిత్వము వ్రాయడంలో జి. యమున, ప్రధమ స్థానం, ఎమ్. మోహిత్, ద్వితీయ స్థానం, (5) పెయింటింగ్ లో శీలం చంద్రలేఖ, ప్రధమ స్థానం, ఈ. సత్యవర్ధన్, ద్వితీయ స్థానంలలో విజేతలుగా నిలచియున్నారు. జిల్లా స్థాయిలో ప్రధమ స్థానం పొందిన విజేతలను రాష్ట్ర స్థాయిలో జరగబోయే పోటీలకు పంపించడం జరుగుతుంది.