BREAKING
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా.. మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి..:బ్రాహ్మణ పెద్దల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం.. రైల్వే ట్రాక్ మార్గాన్ని పునఃపరిశీలించండి..:ఎమ్మెల్యే ఆనందరావుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి.. ముమ్మిడివరంలో 24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె: స్పందించని ప్రభుత్వం.. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వరంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి 52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి. పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు

వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం!

Select Suryaa Now
వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం!

సూర్య పి.గన్నవరం డెస్క్: ఎన్నికల హామీలను గాలికొదిలేసి ప్రజలను నిలువునా మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వెన్నుపోటు విధానాలపై ప్రజలు తిరగబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం, కె.ఏనుగుపల్లి గ్రామంలో నిర్వహించిన ‘గడప గడపకు వైఎస్సార్‌సీపీ’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

ఈ సందర్భంగా గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'ఆడబిడ్డ నిధి' కింద ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు పైసా కూడా విదల్చలేదని మండిపడ్డారు. ఇప్పటివరకు ఒక్కో మహిళకు రూ. 36 వేలు కూటమి ప్రభుత్వం బాకీ పడిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పెన్షన్, ఉచిత గ్యాస్ సిలిండర్ల దీపం పథకం వంటి 'సూపర్ సిక్స్' హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను దగా చేశారని ధ్వజమెత్తారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 12 సంక్షేమ పథకాలను నిరంతరాయంగా, పారదర్శకంగా అమలు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం పథకాల అమలును నామమాత్రంగా మార్చేసిందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీని 'గొడ్డలి పార్టీ' అని విమర్శిస్తున్నారని, వాస్తవానికి హత్య రాజకీయాలు, కక్ష సాధింపులకు పాల్పడుతోంది కూటమి ప్రభుత్వమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.