దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి
సూర్య అమలాపురం డెస్క్: దివంగత ప్రముఖ నేత, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి సందర్భంగా అమలాపురం నియోజకవర్గ అసెంబ్లీ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అమలాపురం పట్టణంలోని స్థానిక నల్లవంతెన సెంటర్ వద్ద ఉన్న జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి అంజలి ఘటించారు. పేదల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నిఖార్సైన ప్రజా నాయకుడు జక్కంపూడి అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, ఎస్.ఈ.సి. సభ్యులు కుడిపూడి భరత్, మాజీ జెడ్పీటీసీ పందిరి శ్రీహరి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ సత్యనాగేంద్ర మణి, రాష్ట్ర విద్యార్థి విభాగ కార్యదర్శి మద్ధింశెట్టి ప్రసాద్, రాష్ట్ర ఇంటెలెక్చువల్ విభాగ కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.
వీరంతా జక్కంపూడి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన ప్రజాసేవలను స్మరించుకున్నారు.అలాగే విద్యార్థి విభాగ రీజనల్ కోఆర్డినేటర్ జిల్లెల రమేష్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, జిల్లా ఐటీ విభాగ అధ్యక్షుడు తోరం గౌతమ్‌లతో పాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల మరియు వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావుకు ఘనంగా నివాళులర్పించారు.