BREAKING
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా.. మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి..:బ్రాహ్మణ పెద్దల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం.. రైల్వే ట్రాక్ మార్గాన్ని పునఃపరిశీలించండి..:ఎమ్మెల్యే ఆనందరావుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి.. ముమ్మిడివరంలో 24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె: స్పందించని ప్రభుత్వం.. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వరంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి 52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి. పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు

రైల్వే ట్రాక్ మార్గాన్ని పునఃపరిశీలించండి..:ఎమ్మెల్యే ఆనందరావుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి..

Select Suryaa Now
రైల్వే ట్రాక్ మార్గాన్ని పునఃపరిశీలించండి..:ఎమ్మెల్యే ఆనందరావుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి..

సూర్య అమలాపురం డెస్క్: పట్టణ తూర్పు వైపున జాతీయ రహదారి (ఎన్‌హెచ్)-216ను ఆనుకుని నూతన రైల్వే ట్రాక్ నిర్మించాలనే ప్రతిపాదనను పునఃపరిశీలించి, ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంపిక చేయాలని అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు స్థానిక శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సమస్యపై సమగ్ర వినతిపత్రాన్ని అందజేశారు.

ప్రస్తుతం జాతీయ రహదారి-216కు ఇరువైపులా వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో రహదారిని ఆనుకుని రైల్వే లైన్ నిర్మిస్తే భవిష్యత్తులో అమలాపురం పట్టణ విస్తరణకు తీవ్ర ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ సర్వతోముఖాభివృద్ధికి, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల విస్తరణకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే ట్రాక్ నిర్మాణానికి వేరొక అనువైన ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించేలా ప్రభుత్వం మరియు రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.

చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోనం సత్య వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతినిధులు కంచిపల్లి అబ్బులు, మోకా వెంకట సుబ్బారావు, కొమ్మూరి వెంకటాచల ప్రసాద్, దొమ్మేటి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ వినతిపై ఎమ్మెల్యే ఆనందరావు సానుకూలంగా స్పందిస్తూ, పట్టణ ప్రయోజనాలు, వ్యాపారుల వినతులను పరిగణనలోకి తీసుకుని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.