తెలంగాణలో కొత్త జిల్లాల దశాబ్ది ఉత్సవాలు: రెండు రోజుల పాటు కార్యక్రమాలకు కేటీఆర్ పిలుపు!
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమై నేటితో పదేళ్లు పూర్తయిన సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా చేపట్టిన ఈ చారిత్రక నిర్ణయానికి దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని, రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడంతో పాటు, ఆయా జిల్లాల సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని, అలాగే జిల్లాల ఏర్పాటు కోసం నాడు ఉద్యమించిన జేఏసీలు మరియు ఉద్యమకారులను ఘనంగా సన్మానించాలని కేటీఆర్ పేర్కొన్నారు.