దసరా సెలవులు: పిల్లలపై ప్రత్యేక నిఘా అవసరం!
సూర్య అద్దంకి.
పాఠశాలలకు, కళాశాలలకు నేటి నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని అద్దంకి సీఐ సుబ్బరాజు కోరారు. చెరువులు, కుంటలు వద్దకు పిల్లలు ఈత కొట్టడానికి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని ఆయన హెచ్చరించారు. పిల్లలను మోటార్ సైకిల్ లకు దూరంగా ఉంచాలన్నారు. పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ సుబ్బరాజు విజ్ఞప్తి చేశారు.