సేవకు మారుపేరు లయన్ రవికుమార్ గౌడ్ -- సెంచరీ పూర్తి చేసుకున్న మీల్స్ ఆన్ వీల్స్ -- నారాయణపేటలో వరుసగా 100రోజుల పాటు అన్నదానం
నారాయణపేట, సూర్యన్యూస్ :
నారాయణపేట పట్టణంలో సేవా కార్యక్రమాలు అంటేనే లయన్ రవికుమార్ గౌడ్ గుర్తుకు వస్తారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆయన తలుపు తడుతుంటారు. ప్రతి ఒక్కరికి తనవంతుగా సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో తాను లయన్ సభ్యులుగా కొనసాగుతున్న టౌన్ కమిటీకి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆయన సేవలు మరింత విసృతం చేయాలనే ఉద్దేశంతో అన్నదానం మహాదానం అనే నానుడిని నిజం చేస్తూ లయన్ రవికుమార్ గౌడ్ వరుసగా 100రోజులుగా మీల్స్ ఆన్ వీల్స్ సేవా కార్యక్రమం చేపట్టారు. తన పదవీకాలం పూర్తిగా అందిస్తానని ప్రకటించి ఒక్కరోజు కూడా ఆపకుండా నిత్యం మధ్యాహ్నం నారాయణపేట పట్టణంలోని శ్రీ సత్యనారాయణ చౌరస్తాలో ఎంతో మందికి ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. గతంలోనూ ప్రత్యేక దినోత్సవాలు, పుట్టిన రోజు, పెళ్ళి రోజు వేడుకల సమయంలో దాతల సహాయంతో ఏర్పాటు చేసిన మీల్స్ ఆన్ వీల్స్ నిర్వహణ బాధ్యతలు ఆయనే చేపట్టి వివిధ క్లబ్ మీటింగ్ లోనూ అభినందనలు పొందారు. దాన్ని స్పూర్తిగా తీసుకుని మరింత విస్తృతం చేయాలనే ఆలోచనతో ఏడాది మొత్తం కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శుక్రవారానికి వంద రోజులు పూర్తిచేసుకుని రికార్డ్ రుస్తించారు.
*సంకల్ప బలం గొప్పది : బట్టడ్*
లయన్ రవికుమార్ గౌడ్ మెయిల్స్ అండ్ వీల్స్ కార్యక్రమ నిర్వహణలో ఆయన సంకల్ప బలం ఎంతో గొప్పదని లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హరినారాయణ్ బట్టడ్ అన్నారు. శుక్రవారం 100వ రోజు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పట్టణంలోని బీదవారితో పాటు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఎంతోమంది వివిధ రకాలైన పనులు, వ్యాపార నిమిత్తం పట్టణానికి వస్తుంటారని, హోటల్ లలో డబ్బులు పెట్టి భోజనం చేయలేక ఖాళీ కడుపుతో వెనక్కి వెళ్తున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. వారియర్స్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ గా ఉంటూ ఉచిత కోచింగ్ అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని కొనియాడారు. ఏడాది మొత్తం నిర్విరామంగా కార్యక్రమం కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సరితా బట్టడ్, మోహన్ కుమార్, శ్రీనివాస్, ఆత్మారాం, మల్లికార్జున్, మాల్ఘన్ జనార్ధన్, కృష్ణమూర్తి, సురేందర్, గీతా గౌడ్, ఆంజనేయులు, శాంత, చక్రవర్తి పాల్గొన్నారు.
– రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.