సూర్య వేములవాడ రూరల్ :వేములవాడ రూరల్ మండలానికి చెందిన గంగిపల్లి వెంకటేష్ మృతదేహం శుక్రవారం స్వగ్రామమైన వట్టెంలకు చేరుకుంది. ఈ నెల 1వ తేదీన దుబాయ్‌లో వెంకటేష్ హఠాత్తుగా మృతి చెందాడు. ఈ విషయాన్ని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, అధికార ప్రతినిధి చెన్నమనేని వికాస్ వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని వేగంగా భారతదేశానికి రప్పించేలా చర్యలు తీసుకున్నారు. కేంద్ర మంత్రి చొరవతోనే వెంకటేష్ భౌతికకాయం స్వల్ప వ్యవధిలోనే స్వగ్రామానికి చేరిందని బీజేపీ నాయకుడు మంద రాజేందర్ గౌడ్, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం, బండి సంజయ్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఈ ఘటన నిరూపించిందని పేర్కొన్నారు.