చీరాలలో 1116 కలిశాలతో జగన్మాత నగరోత్సవం
చీరాలలో 1116 కలిశాలతో జగన్మాత నగరోత్సవం
శ్రీ దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలు చీరాలలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. స్థానిక సంతబజారు శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం మొదటి రోజు సందర్భంగా 1116 కలిశాలతో నగరోత్సవం కార్యక్రమం నిర్వహించారు. పురవీధుల్లో నగరోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు గుంటూరు మాధవరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.