BREAKING
కాంగ్రెస్ నూతన ఇంచార్జ్ బి.ఎం.సందీప్‌ ను మర్యాదపూర్వకంగాకలిసిన పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్ అయ్యప్ప స్వామి మహాపడి పూజకు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్‌ కు ఆహ్వానం గల్ఫ్‌లో విదేశీ సైనిక బలగాలపై ఇరాన్ హెచ్చరిక.. నౌకా దళం విస్తరణకు దక్షిణ కొరియా సన్నాహాలు: తుర్కియే కీలక ఆమోదం.. పాకిస్థాన్, సౌదీ అరేబియాతో సంయుక్త రక్షణ ఒప్పందం అమలుకు మార్గం సుగమం: మహానది కోల్‌ఫీల్డ్స్ మార్కెట్‌లోకి ప్రవేశం.. ఇష్యూ ధర కంటే 2 శాతం తగ్గింపుతో షేర్ల నమోదు: భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి తుది మెరుగులు.. త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందన్న పీయూష్ గోయల్ హిందూపురంలో ఘనంగా కనకదాసు జయంతి వేడుకలు.. భద్రాచలంలో ర్యాపిడో సేవలకు శ్రీకారం* సరంపేటలో ఉచిత వైద్య శిబిరం...! మానసిక ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య పందిళ్లపల్లిలో ఆమంచి ఇంటి వద్ద ఉదృక్తత.. శీతాకాలంలో 10 ఏళ్ల లోపు పిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు శివకుమార్ సూచనలు సంగారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం.. తడిసిముద్దైన వరి ధాన్యం.. భక్త కనకదాసు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన శశికళ కృష్ణమోహన్ నాగసముందర్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

కొందరు నటీమణులు కావాలనే పరాపరాజీలకు డబ్బులిచ్చి మరీ ఆ ఫోటోలు తీయించుకుంటారు: సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు!

Select Suryaa Now
కొందరు నటీమణులు కావాలనే పరాపరాజీలకు డబ్బులిచ్చి మరీ ఆ ఫోటోలు తీయించుకుంటారు: సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తన మనసులోని మాటలను ఎప్పుడూ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటానికి వెనుకాడరు. తాజాగా ఆయన సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు మరియు మీడియా సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో మరోసారి పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. కొందరు నటీమణులు తమ క్రేజ్ పెంచుకోవడం కోసం స్వయంగా పరాపరాజీ ఫోటోగ్రాఫర్లకు డబ్బులు చెల్లించి మరీ వెనుక నుంచి ఫోటోలు తీయించుకుంటారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

సాధారణంగా నటీనటులు ఎక్కడికి వెళ్లినా మీడియా కెమెరాలు వారిని అనుసరించడం, ఫోటోలు తీసుకోవడం పరిపాటిగా మారింది. అయితే సెలబ్రిటీలు ప్రైవసీ దెబ్బతింటోందని వాపోతుండగా, మరోవైపు కొందరు కావాలనే పబ్లిసిటీ కోసం ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారని సల్మాన్ ఖాన్ పరోక్షంగా విమర్శించారు. మీడియాను ఎలా తమకు అనుకూలంగా మార్చుకోవాలో కొందరికి బాగా తెలుసని, కావాలని కెమెరాల ముందుకు వెళ్లేవారే అసలు నిజాలు దాచి ఉద్దేశపూర్వకంగా హడావుడి చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

బాలీవుడ్‌లో గ్లామర్ ఇండస్ట్రీ ట్రెండ్స్ మరియు పబ్లిసిటీ స్టంట్ల గురించి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నటుడి నోటి నుంచి ఇలాంటి నిజాలు బయటకు రావడంతో ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. కొందరు సెలబ్రిటీల తీరుపై సల్మాన్ చేసిన ఈ కామెంట్లు నెట్టింట భిన్నమైన చర్చలకు దారితీస్తున్నాయి. తారల పబ్లిసిటీ కోసం జరిగే ఈ తంతుపై ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్య్ పోతున్నాయి.