BREAKING
మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కోటి రూపాయలు శ్రీదేవి కంటే ముందే ఆ అమ్మాయిని 10 ఏళ్లు ప్రేమించా: తొలి ప్రేమపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు! దసరా సందర్భంగా మున్సిపల్ కార్మికులకు వస్త్రాల పంపిణీ క్రీడల ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి మియాపూర్ సీఐ జయరాంను కలిసిన మాలకొండ రాయుడు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారణలో దర్శనమిచ్చిన నల్ల పోచమ్మ అమ్మవారు ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు బాలీవుడ్‌లో హింసాత్మక చిత్రాలదే రాజ్యమనేది ఒక భ్రమ మాత్రమే: నటుడు గుల్షన్ దేవయ్య వ్యాఖ్యలు! కదిరిలో వైసీపీలో చేరిన టీడీపీ నాయకుడు బిస్కెట్ బాబా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌.. టీడీపీ నిబద్ధత రాజమహేంద్రవరం చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి విమానాశ్రయంలో ఘన స్వాగతం.. కపిలేశ్వరపురంలో హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభం వచ్చే నెలలో కల్లూరు గూడెం పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరం వైసీపీ నాయకుడు గొల్ల బసవరాజుకు ఉమామహేశ్వర నాయుడు నివాళులు దహన సంస్కారాల ఖర్చుల కోసం రూ.5 వేల ఆర్థిక సాయం సిజిపి నిరసనలపై మండిపడ్డ కంగనా రనౌత్: దేశాన్ని అస్థిరపరిచేందుకు దేశద్రోహ శక్తుల కుట్ర అంటూ ఆగ్రహం! దేవుని కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

చిన్నారి హత్య కేసు: కక్షతోనే దారుణం, నిందితుడి కోసం పోలీసుల తీవ్ర గాలింపు

Select Suryaa Now
చిన్నారి హత్య కేసు: కక్షతోనే దారుణం, నిందితుడి కోసం పోలీసుల తీవ్ర గాలింపు

 హైదరాబాద్:సికింద్రాబాద్‌లోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో చిన్నారి దారుణ హత్యకు గురైన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిల్డింగ్ అసోసియేషన్ వారు వారం రోజుల క్రితం ఉద్యోగం నుంచి తొలగించారన్న కక్షతోనే పూర్వ వాచ్‌మెన్ విక్రమ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న విక్రమ్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో అసోసియేషన్ సభ్యులు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో కక్ష పెంచుకున్న విక్రమ్, అపార్ట్‌మెంట్‌కు చెందిన చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేశాడు. ప్లాన్ ప్రకారం చిన్నారిని క్లబ్‌హౌస్ వైపు తీసుకెళ్లాడు. మనవరాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన తాత క్లబ్‌హౌస్ పరిసరాల్లో చిన్నారి కోసం తీవ్రంగా వెతకడం ప్రారంభించారు.

అదే సమయంలో అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, బయటకు తీసుకెళ్లే అవకాశం లేక నిందితుడు విక్రమ్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. పోలీసులు ఎక్కడ పట్టుకుంటారోనన్న భయంతో చిన్నారిని అక్కడే దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని నీటి సంపులో పడేసి పరారయ్యాడు. ప్రస్తుతం నిందితుడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో తిరుగుతున్నట్లు ఆధారాలు లభించడంతో, ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి.