ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్:
పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న 13వ సచివాలయం పరిధిలో కీ.శే. మాజీ కౌన్సిలర్ వై.ఎస్. హమీద్ కుటుంబ సభ్యులతో పాటు సుమారు 40 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల సభ్యులు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ప్రజాదరణకు ఈ చేరికలు నిదర్శనంగా నిలిచాయని మాజీ ఎమ్మెల్యేరాచమల్లు పేర్కోన్నారు.
- షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా