BREAKING
కేంద్ర మంత్ర కిషన్ రెడ్డిని కలిసిన సుదర్శన్ యాదవ్ సౌదీ విమానాశ్రయంపై హౌతీల దాడిని తీవ్రంగా ఖండించిన ఐక్యరాజ్యసమితి: పౌరులపై దాడులు ఆమోదయోగ్యం కాదన్న ఆంటోనియో గుటెర్రెస్! పాకిస్తాన్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వాలో అత్యవసర పరిస్థితి విధింపు ఉట్లపల్లిలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు యెమెన్‌లో జోక్యంపై హెచ్చరించిన ఇరాన్: సౌదీ-పాక్ రక్షణ ఒప్పందం అమల్లోకి రావడంతో పాకిస్తాన్‌పై టెహ్రాన్ విమర్శనాస్త్రాలు! ఆశా వర్కర్ల అరెస్టులు ఆపాలి.. హామీలు అమలు చేయాలి: బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు బి.కృష్ణయ్య న్యూఢిల్లీ పరిణామాలపై ఓహెచ్‌సీహెచ్‌ఆర్ వ్యాఖ్యలను ఖండించిన భారత్ 58 బిలియన్ డాలర్ల విద్యుత్ రంగ ప్రణాళికలో పాకిస్తాన్‌కు పెను సవాళ్లు: అప్పుల సంక్షోభం, ఆర్థిక నష్టాల ముప్పుపై నిపుణుల హెచ్చరిక! బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు తొలి ప్రయత్నంలోనే నీట్‌లో సీటు -- నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ లో చేరిక రియాద్ విమానాశ్రయంపై హౌతీల దాడిని ఆపాలి భారత్ పిలుపు సింగరకొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కరుణ జూపే దయగల తల్లి శ్రీలక్ష్మి అమ్మవారు. హౌతీలపై పోరుకు దిగే అంశాన్ని పరిశీలిస్తామన్న ట్రంప్

రాజంపేటలో రైతుల ధర్నా..

Select Suryaa Now
రాజంపేటలో రైతుల ధర్నా..

 

సూర్య రాజంపేట:రాజంపేట మండలంలో వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు సోమవారం రాజంపేట మండల కేంద్రంలో ధర్నా నిర్వహించనున్నారు. విద్యుత్ కోతలకు నిరసనగా చేపట్టనున్న ఈ ధర్నాలో రైతులందరూ పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని రైతు సంఘం నాయకుడు చింతల స్వామి పిలుపునిచ్చారు.
ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పంటలు కీలక దశలో ఉన్నాయని, ఈ సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఎంతో అవసరమని అన్నారు. విద్యుత్ కోతల కారణంగా రైతులు వ్యవసాయ పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యలను గుర్తించి వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని డిమాండ్ చేశారు.రైతుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ ధర్నాకు రాజకీయాలకు అతీతంగా రైతులందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. ఏ పార్టీకి చెందిన వారైనా రైతుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా భావించి ఐక్యంగా ఉద్యమించాలని చింతల స్వామి విజ్ఞప్తి చేశారు. రైతులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.