BREAKING
కులవృత్తులకు అండగా బీజేపీ బోయినపల్లి మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా చల్ల శ్రీనివాసరెడ్డి .. ప్రేమ పేరుతో వేధింపులు.. - పదో తరగతి బాలిక బలవన్మరణం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన పనులను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దశాబ్ది వేడుకలు దసరా పండుగకు విద్యుత్ దీపాల ఏర్పాటు.. సూర్య మన్కుగూడలో విబి జీ రామ్ పథకం పనులకు శ్రీకారం జిల్లా ఆవిర్భావ దశాబ్ది.. - కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం వాస్తవాలను పక్కదారి పట్టించడమే జగన్‌ రాజకీయ నీతి! మంత్రాలయం శ్రీ మఠంలో ఘనంగా ఘట స్థాపన చెన్నై మెట్రో ఫేజ్-2 పూనమల్లి-వడపళని మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ యూఎస్ 'పెర్మ్' గ్రీన్ కార్డ్ సస్పెన్షన్‌తో మా వ్యాపారానికి ఎలాంటి నష్టం లేదు: ఇన్ఫోసిస్ స్పష్టత.. అసలు కారణాలివే! 14న రెడ్డి మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని గెలిపించండి ఐదున్నర కిలోమీటర్లు సైకిల్ తొక్కి యువతకు దిశా నిర్దేశం చేసిన కేంద్ర మంత్రి

ప్రశాంతంగా ముగిసిన ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ ఎంట్రెన్స్ పరీక్ష -- పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ వినీత్ -- అభ్యర్థులకు ఉచిత భోజనం అందించిన లయన్స్ క్లబ్

Select Suryaa Now
ప్రశాంతంగా ముగిసిన ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ ఎంట్రెన్స్ పరీక్ష -- పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ వినీత్  -- అభ్యర్థులకు ఉచిత భోజనం అందించిన లయన్స్ క్లబ్

నారాయణపేట, సూర్యన్యూస్ :
నారాయణపేట జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ సెంటర్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరీక్ష నిర్వహణ తీరును సమీక్షించారు.
ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 413 మంది పరీక్షకు హాజరయ్యారు. 166 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 70.3 శాతం మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. పోలీస్ బందోబస్తు మధ్య పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు.
త్వరలోనే పరీక్ష ఫలితాలను వెల్లడించి, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల సాధనకు అవసరమైన ఉచిత శిక్షణతో పాటు ఫిజికల్ ఫిట్‌నెస్ శిక్షణ, స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు తెలిపారు. నిరుపేద, మధ్యతరగతి నిరుద్యోగ యువతకు ఈ ఉచిత కోచింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోలీస్ ఉద్యోగాలు సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులకు టౌన్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా లయన్స్ క్లబ్ సహకారంతో టౌన్ అధ్యక్షులు లయన్ రవికుమార్ గౌడ్ ఉచిత అన్నదానం నిర్వహించారు. ఈ బందోబస్తులో అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్ హక్, డీఎస్పీ లు మహేష్, నల్లపు లింగయ్య, సిఐలు శివ శంకర్, రామ్ లాల్, భగవంత్ రెడ్డి, సైదులు ఎస్ఐ లు తదితరులు పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.