14న రెడ్డి మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
సూర్య నస్పూర్ ;రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 14 బుధవారం మంచిర్యాలలోని శ్రీనివాస గార్డెన్స్‌లో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాల పోస్టర్‌ను ఆదివారం నస్పూర్ సిసిసి లోని ఎస్పీ గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు గోనే మణిమాల రెడ్డి, మేకల వనజా రెడ్డి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా రెడ్డి సంఘం మహిళా సభ్యులు హాజరై సంబరాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్కీ డ్రా, మహిళలకు అల్పాహారం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోతే రాఘవరెడ్డి, గౌరవ అధ్యక్షుడు అనుమాండ్ల వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు పుప్పి రెడ్డి బాపురెడ్డి, కోశాధికారి చెరుకు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.