కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
సూర్య, జైనూర్: జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా షేక్ రహీం నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు అర్షద్ హుస్సేన్ తెలిపారు.షేక్ రహీం జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా ఆదివారం జైనూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు షేక్ రషీద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా నూతన జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ రహీం మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లాలోని మైనారిటీ వర్గాలను పార్టీతో మరింత అనుసంధానం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.తన నియామకానికి సహకరించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు అర్షద్ హుస్సేన్, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జైనూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ రషీద్ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుద్దాల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యుడు పెందూర్ ప్రకాష్, మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దుర్వా సింధు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భుజంగ్ రావు, మెస్రం ఇంద్రు, యువ నాయకులు ఆనంద్, లక్ష్మణ్ పటేల్, యూత్ నాయకుడు కోవ సిద్దు, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు షేక్ అబ్బు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు దండుగుల మహేష్, సర్పంచ్ రాజేందర్, సయ్యద్ వసీం, అమృత్, షాకిర్, కొటేష్, నగేష్, రాసిమెట్ట సర్పంచ్ చందన్ షావ్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.