BREAKING
ఘనంగా ప్రారంభమైన 33వ విశ్వ దుర్గేశ్వరిఅమ్మవారి దసరా ఉత్సవాలు పార్వతీపురం అభివృద్ధికి రూ. 152 కోట్లు నిధులు తెచ్చాం ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలి ఎంపీ నిధుల నుంచి రూ.70 లక్షలు నియోజకవర్గం అభివృద్ధి కి మంజూరుచేసిన ఎంపీ శ్రీభరత్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కోళ్ల ఘనంగా ప్రారంభమైన దుర్గాదేవి శరన్నవరాత్రులు వాడవాడల్లో కొలువుదీరిన దుర్గాదేవి అమ్మవారు బాలాపూర్ లో ఘనంగా రెండో సీరత్-ఉన్ -నబీ వేడుకలు మత సామరస్యంతోనే సమాజాభివృద్ధి అన్ని మతాల విశ్వాసాలను గౌరవించాలి లూథరన్ చర్చి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భగవద్గీత అధ్యయనంతోనే ఉత్తమ విద్యార్థిగా ఎదుగుతారు జిల్లా ఏర్పాటై పదేళ్లు.. అభివృద్ధి శూన్యం.. మరో ఉద్యమం తప్పదు: వీడీడీఎఫ్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిక కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి: తమ్మినేని సూర్యనారాయణ(సీపీఎం) విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించిన గ్రంథాలయ అధికారి: 2028 జూన్ నాటికి.... శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి చేయడం నా జీవిత లక్ష్యం... #.నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామానికి రూ.74 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు. #. గుడిశెలు లేని తెలంగాణే లక్ష్యం----- రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా బ్యూరో, ఎల్.కోటలో వైభవంగా దేవీ నవరాత్రులు, శ్రీ వెంకటేశ్వర దివ్యోత్సవాలు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కోళ్ల దంపతులు గంగుబూడిలో నిరుపయోగంగా రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాలు!

ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

Select Suryaa Now
ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సూర్య నంద్యాల బ్యూరో:
జిల్లా ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు ఈ నెల 12వ తేదీ సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదివారం తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌తో పాటు రెవెన్యూ డివిజన్, మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వినతులను పరిశీలించి, నిబంధనల మేరకు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని, అర్జీల పరిష్కార స్థితిని టోల్‌ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు. ముందుగా మండల, రెవెన్యూ డివిజన్ లేదా మున్సిపల్ స్థాయిలో సమస్యలను పరిష్కరించుకోవాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయి PGRSలో సమర్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులను స్వీకరించాలని ఆదేశించారు.

*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*