BREAKING
సీఎం దసరా శుభాకాంక్ష్లలు ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా కోటగిరి శ్రీధర్.. జనరల్ సెక్రటరీగా ఎం. డేనియల్ ప్రదీప్ దండేపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక ఓటు బచావో - దేశ్ బచావో - ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు.. రేపు వికారాబాద్‌లో బీఆర్ఎస్ ప్రత్యేక సమావేశం మంత్రులకు ఘన స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు శివ బాలయోగి మహారాజ్ ఆశ్రమంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం ఎల్ నినోను కాంగ్రెస్ కు అంటగట్టడం హాస్యాస్పదం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రులు రావులపాలెంలో దుర్గాదేవి శరన్నవరాత్రి వేడుకలు: కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి! కాన్షీరాం స్ఫూర్తితో బహుజన రాజ్యాధికారం సాధించాలి: నత్తి మైసయ్య మార్కండేయ ఆలయ కమాన్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి అనారోగ్యంతో ఉన్న జర్నలిస్టు ఆర్‌కేకు జక్కంపూడి రాజా, వేణుగోపాలకృష్ణ పరామర్శ భైరవకోనలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు డబ్బాకుపల్లి సర్పంచ్ అభ్యర్థి రేసులో ఆరుద్ర నాగేశ్వరరావు? సర్పంచ్ పదవిపై ఆసక్తి.. గ్రామంలో జోరుగా సాగుతున్న చర్చలు

గంగుబూడిలో నిరుపయోగంగా రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాలు!

Select Suryaa Now
గంగుబూడిలో నిరుపయోగంగా రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాలు!

 

లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా.. ఫ్లోరింగ్‌ పనులు పూర్తికాక ప్రారంభోత్సవానికి నోచుకోని వైనం

అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి భవనాలను అందుబాటులోకి తేవాలని గ్రామస్థుల విజ్ఞప్తి

లక్క వరపు కోట,  మేజర్ న్యూస్ : గ్రామీణ ప్రజలకు, రైతులకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా మారుతున్నాయి. లక్కవరపుకోట మండలం గంగుబూడి గ్రామంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ హైస్కూల్‌ సమీపంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాలు నేటికీ ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంతో నిరుపయోగంగా మిగిలిపోయాయి. లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనాలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో రైతులకు సేవలందించేందుకు నిర్మించిన రైతు భరోసా కేంద్రానికి రూ.21.50 లక్షలు, ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు నిర్మించిన వెల్‌నెస్‌ సెంటర్‌కు రూ.18.50 లక్షలు నిధులు మంజూరయ్యాయి. మొత్తం రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ రెండు భవనాలకు గోడల నిర్మాణం, రంగులు వేసే పనులు పూర్తిచేసినప్పటికీ, ఫ్లోరింగ్‌ పనులు పూర్తిచేయకపోవడంతో ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఫలితంగా భవనాలు నిర్మించి చాలాకాలం గడుస్తున్నా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు.
పిచ్చిమొక్కలతో నిండిన భవనాల పరిసరాలు

కొత్తగా నిర్మించిన భవనాల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయి, కుక్కలు, మేకలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ప్రజలకు ఉపయోగపడాల్సిన భవనాలు ఇలా నిరుపయోగంగా మారడం పట్ల గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరి దశలో ఫ్లోరింగ్‌ పనులు ఎందుకు నిలిచిపోయాయని సంబంధిత కాంట్రాక్టర్‌ను ప్రశ్నించగా, కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని విడుదల చేస్తే మిగిలిన పనులు పూర్తి చేస్తామని చెప్పినట్లు గ్రామస్థులు తెలిపారు.
పెండింగ్‌ బిల్లులతో నిలిచిన నిర్మాణాలు

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన కొన్ని నిర్మాణాలకు సంబంధించి కొంతమేర బిల్లులు చెల్లించినప్పటికీ, మిగిలిన బిల్లులు విడుదల కాకపోవడంతో మండలంలోని పలు రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాల నిర్మాణాలు కూడా అసంపూర్తిగా నిలిచిపోయాయని స్థానికులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వాలు మారినప్పటికీ ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై, ప్రజాప్రతినిధులపై ఉందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే నిర్మాణాల కోసం ఖర్చు చేసిన ప్రజాధనం వృథా కావడంతో పాటు, రైతులు, రోగులు, సామాన్య ప్రజలు ప్రభుత్వ సేవలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పెండింగ్‌ పనులను పూర్తి చేయించి, గంగుబూడి గ్రామంలోని రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.