మంత్రులకు ఘన స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు
రేపల్లె, మేజర్ న్యూస్;
పట్టణంలో 144 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు భూమి పూజ నిమిత్తం విచ్చేసిన రాష్ట్ర గృహ సమాచార శాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణరావుకు తెలుగుదేశం, బిజెపి, జనసేన నాయకులు భారీ సంఖ్యలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి పెనుమూడి హైవే వద్దకు వెళ్లి ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా పెనుమూడి హైవే వరకు వెళ్లి అక్కడే నూతనంగా ఏర్పాటు చేసిన వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొని వాటిని ప్రారంభించారు ర్యాలీ కార్యక్రమం మొదటి నుంచి పూర్తయ్యే వరకు అభిమానులు కార్యకర్తలు మంత్రి అనగానీి సోదరులు అనగాని శివప్రసాద్ ర్యాలీని ఘనంగా నిర్వహించేందుకు కార్యకర్తలకు అభిమానులకు ప్రత్యేక సూచనలు చేసి మంత్రులకు ఘన స్వాగతం పలికి విజయవంతం చేశారు.