BREAKING
వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ!

అనారోగ్యంతో ఉన్న జర్నలిస్టు ఆర్‌కేకు జక్కంపూడి రాజా, వేణుగోపాలకృష్ణ పరామర్శ

Select Suryaa Now
అనారోగ్యంతో ఉన్న జర్నలిస్టు ఆర్‌కేకు జక్కంపూడి రాజా, వేణుగోపాలకృష్ణ పరామర్శ

సూర్య తూర్పుగోదావరి జిల్లా & రాజమహేంద్రవరం డెస్క్: రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరం పరిధిలోని ఎర్రగొండలో అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ జర్నలిస్టు కే. రామకృష్ణ (ఆర్‌కే)ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆదివారం స్వగృహంలో పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంయుక్తంగా ఆయన నివాసానికి చేరుకుని యోగక్షేమాలను విచారించారు.

ఇటీవల తీవ్ర గుండె సంబంధిత సమస్య తలెత్తడంతో ఆర్‌కే ఆసుపత్రిలో చేరి స్టెంట్ వేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య చికిత్సల వివరాలను నేతలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్‌కే త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.